కరీంనగర్

అబ్బురపడేలా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో అట్టడుగు స్థాయిలో ఉన్న తెలంగాణ పురోగతి యావత్ దేశం అబ్బురపడేలా పయనిస్తోందని, గత మూడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ది శరవేగంగా కొనసాగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. నాడు ఉద్యమాలకు స్పూర్తిగా మారిన జిల్లా నేడు రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా మారిందన్నారు. రాష్ట్భ్రావృద్దిలో జిల్లా కీలకపాత్ర పోషిస్తుండగా, సంక్షేమ పథకాల ప్రారంభానికి జిల్లా మార్గదర్శిగా మారిందని, జిల్లాలో చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండటమే కాక, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నాయన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించిన ప్రభుత్వం జిల్లాను రోల్‌మోడల్‌గా తీసుకుని వీటిని అమలుపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అన్ని రంగాల్లో అగ్రేసరగా జిల్లాను ముందుకు తీసుకువెళ్ళటంలో అధికారుల పాత్ర ఎంతో ఉందన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా 1,76,083 కుటుంబాలకు రూ.48కోట్లతో మరుగుదొడ్లు నిర్మించి, రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో, దేశంలో 20వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు అందరు సహకరించాలని పిలుపునిచ్చారు. గత కొనే్నళ్ళుగా కరువు కరాళ నృత్యం చేస్తుండగా, ఏయేటికాయేడు తగ్గుతున్న అటవీ సంపదను పెంచేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని, ఇప్పటివరకు 35లక్షలకుపైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. దేశానికి వెనె్నముక అయిన రైతు సంక్షేమాన్ని కాంక్షించి, తమ ప్రభుత్వం ఇప్పటికే రుణ మాఫీ చేసిందని, తాజాగా ఎకరాకు రూ.8వేల చొప్పున పెట్టుబడి నగదుగా అందించేందుకు నిర్ణయం తీసుకుందని, రాబోయే ఖరీఫ్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు చెప్పారు. రైతులకవసరమైన సాగు నీరందించేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి కూడా శంకుస్థాపన చేశామన్నారు. విద్యుత్ కోతలతో అల్లాడుతున్న రైతాంగం కోసం నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయోగాత్మకంగా జిల్లాలో ఈనెల నుంచే అమలు చేస్తున్నట్లు, నివాస గృహాలపై ఉన్న హైటెన్షన్ వైర్లను కూడా తొలగించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తాగునీటి కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులు గమనించి, వారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇంటింటికి తాగునీరందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఆరంభించామని, ఆ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని, వచ్చే జనవరి నాటి నుంచి ఇంటింటికి నల్లా నీరు అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామాలకు చెరువులే జీవనాధారం కాగా, వట్టిపోయి వెలవెలబోతున్న వాటిని పునరుద్దరించి, గ్రామాలను సస్యశ్యామలంగా మార్చేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తూ, కార్పోరేట్ తరహా విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వాస్పత్రులను కార్పోరేట్ స్థాయిలో ఆధునీకరిస్తూ, పేద రోగులకు అత్యుత్తమమైన వైద్య సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా త్వరలోనే చేపట్టనున్నట్లు ప్రకటించారు. కుల వృత్తుల ప్రోత్సాహంలో భాగంగా గొల్ల కుర్మలకు 75శాతం రాయితీతో గొర్ల యూనిట్లు మంజూరీ చేస్తున్నట్లు, ఇప్పటికే 80శాతానికిపైగా యూనిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. అలాగే నాయిబ్రహ్మణులకు నవీన క్షౌరశాలలు, రజకులకు అధునాతన యంత్రాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా అడిగిన ప్రతి కూలీకి పని కల్పించి, ఉపాధినిస్తున్నామన్నారు. మొన్నటివరకు నరకానికి నకల్లుగా మారిన రహదారులను అభివృద్ది చేసేందుకు రూ.218కోట్లు మంజూరు చేశామని, ఈ నిధులతో జిల్లాలోని ప్రతి రహదారిని మెరుగుపర్చనున్నట్లు చెప్పారు. ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిలూదిన కరీం‘నగరాన్ని’ పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలో ఎల్‌ఎండి దిగువన మానేరు రివర్ ఫ్రంట్ నిర్మించే చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అతిచిన్న నగరమైనా ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటుదక్కటంతో నగరం నందనవనంగా మారబోతుందని, నగరాభివృద్దిలో పార్టీలకతీతంగా అందరూ భాగస్వాములై తెలంగాణాకే తలమానికంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌బాబు, మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమషనర్ కమలాసన్‌రెడ్డి, ఇతర విభాగాల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, నగరవాసులు తదితరులు పాల్గొన్నారు.