కరీంనగర్

వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 22: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య విధానంలో విప్లవాత్మక మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణలో అంతర్భాగంగా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి అన్నా రు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఒకే రోజు రూ.50 కోట్లకు పైగా నిధులతో జిల్లాలో వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవడం శుభ పరిణామమన్నారు. స్వాతంత్య్ర వచ్చి 70 ఏళ్ళు పూర్తి అయినా ఇప్పటికీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఐసియు, డయాలసిస్ యూనిట్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఖర్చుతో కూడిన నిలాంటి వైద్య సేవలు పేదలు పొందేందుకు తమ స్వంత ఆస్తులను తెగనమ్ముకునే పరిస్థితి ఇప్పటి వరకు ఉండేదని, దీనిని దూరం చేసి ఖరీదైన వైద్యంను పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో పది పడకల సామర్థ్యం గల ఐసియును ఏర్పాటు, డయాల్సిస్ యూనిట్ ద్వారా రోజుకు వంద మందికి సేవలు పొందే సౌకర్యం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 కేంద్రాలలో డయాల్సిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఈ అంశంలో దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందన్నారు. సిరిసిల్లలో రక్తం ఎక్కించుకోవాలంటే బ్లడ్ బ్యాంక్ లేని దుస్థితి ఉండేదని, ఈ పరిస్థితిని దూరం చేయడానికి బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాట చేశామని, అలాగే మాడ్రన్ లేబర్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, రాజకీయ జీవితం ప్రసాదించిన సిరిసిల్ల రుణంను వీటి ఏర్పాటు ద్వారా తీర్చుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా ప్రజల ఉజ్వల భవిష్యత్‌కై సిఎం ఆశీస్సులు మంత్రి లక్ష్మారెడ్డి సహకారంతో రూ.36.5 కోట్లతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణంకు, మాతా శిశు సంరక్షణ కేంద్రం 50 పడకల సామర్థ్యం గల భవనం నిర్మాణంకు రూ.13.05 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నామని, ఈ రెండింటిని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. సిరులుండే సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో యువతులకు భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాధిముబారక్ పేరుతో రూ. 75,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. అమ్మబడి పేరుతో ప్రసూతికి మూడు నెలల ముందు, తర్వాత విశ్రాంతి ఇచ్చేందుకు వీలుగా మహిళలకు అమ్మవొడి ద్వారా నెలకు రూ.2000 చొప్పున రూ.12 వేలు అందిస్తున్నామని, కెసిఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, 30-40 శాతం ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 800 మందికి కెసిఆర్ కిట్‌ను అందించామన్నారు. ఆరోగ్య తెలంగాణ రూపు దిద్దుకోవాలంటే ప్రభుత్వం వైపు నుండే కాక ప్రజల వైపు నుంచి సహకారం ఉండాలన్నారు. చికిత్స కంటే నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మరుగుదొడ్లను వంద శాతం ఉపయోగించుకోవాలని, పిల్లల నుండి అలవాట్లను నేర్పించాలని, పందులు పట్టణంలో లేకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ వేధికపై నుండి వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేస్తూ జిల్లాలో 5.50 లక్షల మంది ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. బండలింగంపల్లి, లింగన్నపేటలో పి హెచ్‌సి భవనాలు ప్రారంభోత్సవాలు సిద్దంగా ఉన్నాయని, అయితే సిబ్బందిని లేరని, వీరిని భర్తీ చేయాలని కోరారు. పిహెచ్‌సిలో మెడికల్, పారా మెడికల్ సిబ్బంది సమయ పాలన పాటించేలా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, అలాగే సూపర్ స్పెషాలిటి వైద్యులను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో పిజి డిప్లోమా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, ఎంపిపి శ్రీలత, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మినారాయణ, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ కృష్ణ్భాస్కర్, డిఆర్వో శ్యాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు.