కరీంనగర్

హిందూ పండుగలపై వివక్ష ఎందుకు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 22: రంజాన్ పండుగకు నెలరోజుల పాటు భారీ ఏర్పాట్లు, క్రిస్‌మస్ పండగకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ అంగరంగవైభవంగా నిర్వహించే యంత్రాంగం హిందూ పండుగలపై ఎందుకు వివక్ష కనబర్చటం వెనుక ఆంతర్యమేంటంటూ భారతీయ జనతాపార్టీ నగరశాఖ ఆధ్వర్యంలోమంగళవారం బల్దియా ఎదుట భారీ ఆందోళన చేపట్టింది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక నవరాత్రోత్సవాలు మరో మూడు రోజుల్లో ప్రారంభమవుతుండగా, ఇప్పటికీ నగరంలో కనీస ఏర్పాట్లు చేయకపోవటంపై కార్యకర్తలు కదం తొక్కారు. వందలాది మంది భారీ ర్యాలీగా తరలివచ్చి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కార్యాలయాన్ని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవటంతో, కార్యకర్తలు ఎదురు తిరిగారు. దీంతోబిజెపి నాయకులను అదుపులోకి తీసుకునే యత్నం చేయటం, కార్యకర్తలు అడ్డుపడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం వెరసి బల్దియా ఎదుట కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టు చేసిన నాయకులను పోలీసు శిక్షణా సంస్థకు తరలించి, కొద్దిసేపటి అనంతరం తిరిగి విడుదల చేశారు. ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర అధికారప్రతినిధి బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలోదుమ్మెత్తిపోశారు. నవరాత్రులను పురష్కరించుకుని ముందస్తు చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంపై ద్వజమెత్తారు. క్షేత్రస్థాయిలోకనీస ఏర్పాట్లు కూడా చేయకుండా హిందువుల మనోభవాలు దెబ్బతీస్తూ, పరోక్షంగా ఇతర మతాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రాన్స్‌కో, ఆర్ అండ్ బి, ఎస్సారెస్పీ,రెవెన్యూ, బిఎస్‌ఎన్‌ఎల్, పోలీస్, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తకపోవటం శోచనీయమన్నారు. నగర రోడ్ల పరిస్థితులు అధ్వాన్నంగా ఉండగా, వినాయకులు మంటపాలకు చేరుకునే నాటికే చెట్ల కొమ్మలు, విద్యుత్, టెలిఫోన్ తీగలు సరిచేయాల్సి ఉండగా, అధికారులు పట్టింపులేని విధంగా వ్యవహరించటం ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నట్లు తేటతెల్లమవుతుందన్నారు. ఈవివక్ష ఇలాగే కొనసాగితే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. వెంటనే కాలనీల్లో మంటపాల వరకు ఉన్న గుంతలను పూడ్చివేయాలని, నగరంలోని ప్రధాన రహదారులన్నీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని, ఉత్సవాలు ముగిసేవరకు ఆయా శాఖల అధికారులతోనిత్యం సమీక్షలు జరపాలని, మంటపాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేయాలని, టెండర్లపేర కాలయాపన చేయకుండా వెంటనే నిర్వహించి, నాణ్యతతోకూడిన పనులు చేపట్టాలని, నిమజ్జనానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని, నిమజ్జన ప్రాంతాలైన మానకొండూర్, చింతకుంట,కొత్తపల్లిలోగతానుభవాల దృష్ట్యా ఎక్కువ సంఖ్యలోక్రేన్‌లు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు, మైక్ సెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలోయువమోర్చా జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీన్‌రావు, నాయకులు పాదం శివరాజ్,దుబాల శ్రీనివాస్, కటకం లోకేష్, బండ రమణారెడ్డి, కచ్చు రవి, దుర్శేటి సంపత్, సింగిరాల రామరాజు, ఎన్. భాస్కర్, పసుల విజయ్, ఆకుల నరేశ్, లడ్డు ముందడా, సృజన్,జెల్లోజు చిట్టిబాబు, బండ అనిత, సుంకె యశోదతో పాటు 200మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హుజూరాబాద్, ఆగస్టు 22: హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామ పరిధిలో గల బొత్తలపల్లి గ్రామానికి చెందిన రూపిరెడ్డి ప్రదీప్ రెడ్డి (36) అనే రైతు మంగళవారం ఇంటిలో ఉరివేసుకొని మృతి చెందాడు. గ్రామంలో పలువురి వద్ద అప్పులు తీసుకొని వ్యవసాయం చేయగా, తగిన పంట రాకపోగా, ఈ సంవత్సరం కూడా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉండడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు హుజూరాబాద్ సిఐ రమణమూర్తి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పండుగలకు పటిష్ట బందోబస్తు

* ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి
* గోవుల అమ్మకాలపై దృష్టి సారించాలి
* సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
* కరీంనగర్ రేంజ్ డిఐజి రవివర్మ స్పష్టం

కరీంనగర్, ఆగస్టు 22: గణేష్ నవరాత్రోత్సవాలు, బక్రీద్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కరీంనగర్ రేంజ్ డిఐజి సి.రవివర్మ పోలీస్ అధికారులను ఆదేశించారు. గణేష్ మండపాల వద్ద పటిష్ట బారీకేడ్లు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని దివంగత ఉమేశ్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో కరీంనగర్, రామగుండం కమీషనరేట్లు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ గణేష్ నవరాత్రోత్సవాల ప్రారంభం నుండి నిమజ్జనం వరకు శాంతి కమిటి సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. వివిధ మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నవరాత్రోత్సవాలు ముగిసేంతవరకు రేయింబవళ్లు పెట్రోలింగ్ ఉదృతం చేయాలని చెప్పారు. నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం నుండి ప్రారంభమై అర్ధరాత్రి వరకు ముగిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విగ్రహాల ప్రతిష్టాపన కోసం నిర్వాహకులు అన్ని రకాల అనుమతులు తీసుకునేలా చూడాలని అన్నారు. నిమజ్జనం ప్రాంతాల్లో అదనంగా క్రేన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అల్లర్లు సృష్టిస్తారనే అనుమానం ఉన్న వ్యక్తులు, రౌడీషీటర్లను బైండోవర్ చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని చెప్పారు. సిసి కెమెరాల ప్రాధాన్యతను తెలియజేస్తూ సిసి కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు సుహృద్భావ వాతావరణం కల్పించడం కోసం 5ఎస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. పశువుల సంతల్లో కూడా గోవుల అమ్మకాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోవుల రవాణా నియంత్రణ కోసం సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆధ్యాత్మిక, శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రోత్సవాలు, బక్రీద్ వేడుకలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్, రామగుండం కమీషనర్లు కమలాసన్ రెడ్డి, విక్రమ్‌జిత్ దుగ్గల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలు అనంతశర్మ, విశ్వజిత్ కంపాటి, డిసిపిలు విజయేందర్ రెడ్డి, జాన్‌వెస్లీ, ఎఎస్‌పి సింధుశర్మ, ఎసిపిలు తిరుపతి, రామారావు, అశోక్ కుమార్, రవీందర్ రెడ్డి, చిన్నయ్య, డిఎస్పీలు మల్లారెడ్డి, చంద్రశేఖర అవధాని, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

సామరస్యంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

* జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి

పెద్దపల్లి, అగస్టు 22: జిల్లాలో గణేష్ నవరాత్రోత్సవాలను ప్రజలు సామరస్యంగా జరుపుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ చతుర్థి ఉత్సవాలపై ఇన్‌చార్జి కలెక్టర్ సంబందిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గణేష్ చతుర్థి సందర్బంగా వాటికి సంబందించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలని అన్నారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నవరాత్రులకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీరు. విద్యుత్, పారిశుద్యం, మెడికల్, లైటింగ్ వంటి ఏర్పాట్లను చేయాలని, ఉత్సవాల సందర్బంగా ప్రజలకు ఇబ్బంది కల్గించే సౌండ్స్, (డిజె)లను ఏర్పాటు చేయరాదని గణేష్ ఉత్సవ కమిటికి వివరించారు. ప్రజలు కూడా నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసిన మండపాలలో తక్కువ సౌండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎకో ప్రెండ్లీగా ఉండే మట్టి వినాయకులను ప్రోత్సహిస్తుందని, ప్రజలుకూడా మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తక్కువ ఎత్తులో ఉన్న కేబుల్, విద్యుత్ వైర్లను తొలగించి ఎక్కువ ఎత్తులో వేయాలని, గణేష్ నవరాత్రుల సందర్బంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వినాయక నిమజ్జనం సమయంలో విగ్రహాలు సీరియల్ నెంబర్‌గా రూట్ మ్యాఫ్ కేటాయించాలని, నిమజ్జన ప్రదేశాలలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. బారి క్రేన్‌లు ఏర్పాటు చేయాలని, చౌరస్తాలలో లైట్‌లు ఏర్పాటు చేయాలని, పోలీస్‌శాఖ ఈనవరాత్రుల సందర్బంగా భధ్రత పెంచాలన్నారు. అసాంఘిక శక్తులు వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 2న బక్రీద్ ఉన్నందున వాటికి తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలు మతపెద్దలు పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని, ఘర్షణ వాతావరణం లేకుండా చూడాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జి డిఆర్‌ఓ అశోక్‌కుమార్, ఆర్‌డిఓ పద్మయ్య, పెద్దపల్లి సిఐ ఎడ్ల మహేష్, సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతులనే పూజిస్తే మంచిది

* జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ
* 1,750 మట్టి గణపతుల పంపిణీ

కరీంనగర్, ఆగస్టు 22: మట్టితో చేసిన వినాయకులకు పూజ చేస్తే మంచిదని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మట్టి గణపతులను పంపిణీ చేశారు. 1,750 మట్టి గణపతులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా వినాయక ప్రతిమలు అందిస్తున్నామన్నారు. యువజన సంఘాలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే భక్తులు, కుటుంబాలు కూడా జడ్పీకి వచ్చి వినాయక ప్రతిమలు తీసుకుపోవచ్చని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యే గణపతుల వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా చెరువులోని నీరు కలుషితమవుతాయన్నారు. దీనికి బదులుగా మట్టి గణపతులు వినియోగిస్తే పర్యావరణం బాగుంటుందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు మాట్లాడుతూ ప్రజల్లో పర్యావరణంపై చైతన్యం కలుగాలన్నారు. ప్రకృతిలో మమేకమై జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ సిఇఓ పద్మజారాణి, జడ్పీటిసిలు వీర్ల కవిత, తన్నీర్ శరత్ రావు, మేడిపల్లి ఎంపిపి జమున, కరీంనగర్ డెవలప్‌మెంటు ఫోరం అధ్యక్షుడు తుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

కన్నపు దొంగ అరెస్ట్

* రూ.4.51 లక్షల విలువ చేసే సొత్తు సీజ్
* ఇండ్లకు తాళాలు వేస్తే సమాచారం అందించాలి
* కరుడుగట్టిన నేరస్థులపై పిడి యాక్టు అమలు
* కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 22: గత కొంత కాలంగా దొంగతనాలు చేస్తు తప్పించుకు తిరుగుతున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రాత్రి వేళల్లో కన్నపు దొంగతనాలకు పాల్పడిన బొడసు మహేష్ (24)ను మంగళవారం చొప్పదండి పోలీసులు అరెస్ట్ చేసి ఇతని నుంచి రూ.4.51 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి దొంగ వివరాలను వెల్లడించారు. వెల్లుల్ల గ్రామానికి చెందిన మహేష్ తల్లిని తండ్రి 2007లో హత్య చేయగా, తల్లి హత్య అనంతరం నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌కు వెళ్లి బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే 8వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం కుల వృత్తిలో చేరగా, పనిలో ఏకాగ్రత చూపకపోవడంతో వరుసకు సోదరుడైన వ్యక్తి మహేష్‌పై చేయి చేసుకోగా, ఆ తరువాత అతని జేబులో ఉన్న వెయి రూపాయలను దొంగిలించి కరీంనగర్‌కు చేరుకొని తొలుత లారీ క్లీనర్‌గా పనిచేశాడు. తరువాత వివిధ హోటళ్లలో పనికోసం ప్రయత్నించగా ఎవరు పనిలోకి తీసుకోకపోవడంతో దొంగతనాలు చేయడం అలవాటు చేసుకొని ఉదయం వేళల్లో ఒంటరిగా వెళ్లి ఇండ్లను ఎంచుకొని రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బులతో అతిగా మద్యం సేవించడం, సినామాలు చూడడం, వ్యభిచారం చేయడం లాంటివి చేసేవాడు. మహేష్ కరీంనగర్ జిల్లాలో 7, జగిత్యాలలో 4, నిజామాబాద్‌లో 3 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ చేసి రూ.4.51 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, మూడు మోటార్ సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొన్నట్లు కమీషనర్ తెలిపారు. దొంగను పట్టుకున్న చొప్పదండి పోలీసులను కమీషనర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లకు తాళాలు వేసి వెళితే పోలీసులకు సమాచారం అందించాలని ఇంటి యజమానులకు సూచించారు. తరచు నేరాలకు పాల్పడే కరుడుగట్టిన నేరస్థులపై పిడి యాక్టు అమలు చేస్తున్నామని, ఇప్పటికే అనేక మంది దొంగలపై పిడి యాక్టు అమలు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎసిపి తిరుపతి, చొప్పదండి సిఐ రమేష్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

సిసి కెమెరాల ఏర్పాటుకు రూ.1.5 లక్షల విరాలం

చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా సిసి కెమెరాల ఏర్పాటుకోసం సర్పంచ్ ఘంటల అనిత-రమణారెడ్డి, ఎంపిటిసి కోమల్ల రాజేశ్వరి-రాజేశంలు మంగళవారం పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డికి రూ.1.5 లక్షల విరాళాల చెక్కును అందజేశారు.

శాంతియుత వాతావరణంలో గణపతి ఉత్సవాలు జరుపుకోవాలి

* సిఐ శ్రీనివాస్‌జీ

హుస్నాబాద్, ఆగస్టు 22: డివిజన్ పరిదిలోని అక్కన్నపేట,హుస్నాబాద్ మండల పరిదిలోని గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హుస్నాబాద్ సర్కిల్ శ్రీనివాస్‌జీ గణేశ్ ఉత్సవ కమిటి సభ్యులను కొరారు. మంగళవారం అయన గణపతి ఉత్సవా కమీటి లతో పాటు పలు మత పెద్దలు వివిధ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ అనుమతి లేకుండ ఎలాంటి అర్బాటాలుచేయడం,విద్యుత్ అధికారుల అనుమతి లేనిదే కరంటు వాడు కొరాదని అనుమతి లేనిదే మైకులు డిజియోలతో సౌండ్ పొలీషన్ ఎర్పాడిన మద్యం సేవించి వాహనాలపై తిరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరపంచాయతి చైర్మెన్ సుద్దాల చంద్రయ్య మాట్లాడుతూ ఈ సారి గణేశ్ ఉత్సవాలు,ముస్లీంల పండుగ ఒకే సారి వస్తున్నందున కుల మతాలకు ఆతీతంగా అందరం కలిసి శాంతి యుత వాతావరణంలో జరుపుకొనుటకు పోలీస్ అధికారులు సూచించిన నిబందనల మేరకు గణేశ ఉత్సవాలను జరుపుకొవాలని కొరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి భూక్య మంగ ఎస్. ఐ సంజీవ్, కౌన్సిలర్స్ వివిధ పార్టీ నాయకులు పాల్గోన్నారు.