కరీంనగర్

రాష్ట్రంలో గడీల పాలనకు సర్కార్ తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 18: రైతు సమన్వయ సమితిల పేర పల్లెల్లో తెరాస ప్రభుత్వం ‘రాబందుల సమన్వయ సమితి’లు ఏర్పాటు చేసి నయా రజాకార్ల వ్యవస్థను సృష్టిస్తోందని, అదే విధంగా గడీల పాలనకు తెర లేపారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కెకె.మహేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పచ్చగా, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాబందుల సమన్వయ సమితిలు పెట్టి అల్లకల్లోలం సృష్టిస్తున్నారని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. కెసిఆర్ తన రాజకీయ లబ్ధి కోసం సమితులను పెట్టాడని, మూడేళ్లుగా టిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసుకుని, కార్యవర్గం కూడా వేసుకోలేని కెసిఆర్ తన అనుబంధ రైతు సంఘాల ద్వారా రైతుల గిట్టుబాటు ధరను డిమాండ్ చేయకుండా, వాటిని పక్కన పెట్టి, ప్రతి పక్షాలు గగ్గోలు పెట్టినా, చట్టం అనుమతించకున్నా జీవోను తెచ్చి ప్రజలపై సమితులను రుద్దడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే, అల్లకల్లో లం, రక్తపాతం వద్దనుకుంటే వెంటనే రైతు సమన్వయ సమితిలు అనబడే రాబందుల సమితిలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ దురాలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. తాడ్వాయిలో గిరిజనుడిపై, గంభీరావుపేటలో ఎస్టీ ఉపసర్పంచ్‌ల పై దాడులు జరిగితే ఎలాంటి చర్యలు లేవన్నారు.