కరీంనగర్

అట్టుడికిన కలెక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 18: చెరకు రైతుల ఆందోళనతో కలెక్టరేట్ అట్టుడికింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో నిజాం చెక్కర ఫ్యాక్టరీని తెరిపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, దాని కింద ఆధారపడి చెరుకు రైతుల పరిస్థితి దననీయంగా మారిందని సోమవారం రైతులతో సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి, మెట్‌పల్లి మాజీ ఎమ్మె ల్యే కొమిరెడ్డి రాములు కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున చేపట్టిన ధర్నా, రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని జీవన్‌రెడ్డి, రాములు రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనతో పోలీసులు జోక్యం చేసుకుని జీవన్‌రెడ్డి, రాములుతో పాటు రైతులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని జగిత్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దే వేందర్‌రెడ్డి, ఎంపిపి గర్వందుల మానస నరేష్‌గౌడ్, డిసిసి ఉపాధ్యక్షుడు బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూష ణం, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, వైస్‌చైర్మన్ మన్సూర్ అలీ గ్రామాలకు చెందిన చెరకు రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సహకారంలో తెలంగాణ ప్రథమ స్థానం
* ఖాతాదారులకు మైక్రో ఏటీఎం కార్డులు* టెస్కాబ్ అధ్యక్షుడు రవీందర్‌రావు
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 18: పది లక్షల కిసాన్ డెబిట్ కార్డులు అందించి దేశంలోనే సహకార వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి ఖాతాదారులకు త్వరలోనే మైక్రో కార్డులను అందించడం జరుగుతోందని టెస్కాబ్ అధ్యక్షుడు కొండూరీ రవీందర్‌రావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కెడిసిసిబి ఆధ్వర్యనా నెలకొల్పిన ఏటి ఎం కేంద్రాన్ని ఆయన సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ రైతులతో పాటు వ్యాపార, వాణిజ్యదారులకు మెరుగైన బ్యాంకు సేవలు అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో మొత్తం 21 ఏటి ఎం కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. మరో 29 ఆరంభించేందుకు సిద్ధమయ్యామని అన్నారు. బ్యాంకుల చుట్టు తిరిగి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇంటి వద్ద నుంచి మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు మైక్రో కార్డుల సేవలను విస్తృత పరుస్తున్నామని అన్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని రవీందర్‌రావు కోరారు. కెడిసిసిబి జిల్లా ఉపాధ్యక్షుడు ఉచ్చిడి మోహన్‌రెడ్డి, జడ్పిటిసి సభ్యుడు ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మార్కెటు కమిటి అధ్యక్షుడు సుభాష్, ‘సెస్’ డైరెక్టర్ మల్లారెడ్డి, సీ ఈవో సత్యనారాయణరావు, బ్యాంక్ మేనేజర్ సుజాత, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నేతలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో ఎటిఎం కేంద్రం
గంభీరావుపేట, సెప్టెంబర్ 18: రైతులకు అందుబాటులో ఎటిఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎటిఎం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇకమీదట రైతులు రైతులు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇక నుండి బ్యాంక్‌ల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి వుండదని రైతులకు అందచేసిన ఎటిఎం కార్డుల ద్వారా నేరుగా ఎటిఎం ద్వారా డబ్బులు పొందవచ్చునన్నారు.
కులాలను వక్రీకరిస్తే ఊరుకోం
* చరిత్ర తెలుసుకుని పుస్తకాలు రాయాలి * వైశ్యసంఘం నేత బాశెట్టి లక్ష్మణ్
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 18: సామాజాన్ని చైతన్యవంతం చేసే రచయితలు చరిత్ర తెల్సుకుని పుస్తకాలు రాయాలని, కొన్ని కులాలను కించపరుస్తూ, సమాజానికి వారందిస్తున్న సేవలను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా సంఘం హెచ్చరించింది. సోమవారం ఆసంఘం జిల్లాఅధ్యక్ష,కార్యదర్శులు నగరంలోవిలేఖరులతో మాట్లాడుతూ, రచయిత కంచె అయిలయ్యపై తీవ్రస్థాయిలోమండిపడ్డారు. కొమట్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకాన్ని రాసి, సమాజంలో తమకున్న పలుకుబడిని, మంచిపేరును నాశనం చేసేందుకు కుట్రపన్నిన అయిలయ్య సామాజిక ఉగ్రవాదిగా మారాడని దుమ్మెత్తిపోశారు. వాక్‌స్వాతంత్య్రం ఉందనే ధీమాతోకులాలు,మతాలను ఇష్టం వచ్చినట్లు నిందిస్తేతామేమి మిన్నకుండబోమన్నారు. కులానే్న కాకుండా మతాన్ని, దేశాన్ని, తుదకు జాతిపితను సైతం విమర్శించటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. గాంధీజీ స్వాతంత్య్రం తెచ్చిన దేశంలోనివసిస్తున్నందువల్లే కంచె అయిలయ్య కుహనావిమర్శలు చేస్తున్నాడని, ఇదే గల్ఫ్ దేశాల్లో అయితే, ఆదేశంలోని మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే, ఆయనకు చేతల్లోనే సమాధానం చెప్పేవారన్నారు. పిచ్పి రాతలు రాసి కులాల మద్య చిచ్చుపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. వారి వెంట వైశ్యసంఘం నాయకులు గుండా రాధాకిషన్, పి.రమేశ్, సిహెచ్.వెంకటేశ్‌తో పాటు పలువురు ఉన్నారు.