కరీంనగర్

ఈసారి కి(ల)క్కు ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 21: మద్యం తాగితే కిక్కు ఎక్కడం అనేది సహజం. కానీ ఇక్కడ మద్యం టెండర్లే కిక్కెక్కించాయి. ఎన్నికల సంవత్సరం కలిసి రావడంతో లిక్కర్ వ్యాపారులు పోటాపోటీగా టెండర్లు దాఖలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 270 మద్యం దుకాణాలకుగాను 3,453 టెండర్లు దాఖలయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈ సారి 528 టెండర్లు అధికంగా దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, దాఖలైన టెండర్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్దతిని మద్యం షాపులను కేటాయించనున్నారు. ఈ మేరకు ఆబ్కారీ అదికారులు అంతా సిద్ధం చేయగా, కి (ల)క్కు ఎవరికి దక్కనుందోననే ఉత్కంఠ వ్యాపారుల్లో నెలకొంది. గత ఎక్సైజ్ పాలసీ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం 2017-19 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. గతంలో ఒక్కొ మద్యం దుకాణానికి టెండరు వేసేందుకు రూ.50వేలు ఉండగా, దానిని రూ.లక్షకు పెంచింది. ఈ లక్ష తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు. అయినా మద్యం వ్యాపారులు పోటాపోటీగా టెండర్లు దాఖలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 270 మద్యం షాపులకు గాను మొత్తం 3,453 టెండర్లు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 89 దుకాణాలకుగాను 1084, జగిత్యాల జిల్లాలో 64 దుకాణాలకుగాను 1047, పెద్దపల్లి జిల్లాలో 75దుకాణాలకుగాను 650, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42 దుకాణాలకుగాను 672 చొప్పున టెండర్లు దాఖలయ్యాయి. నాలుగు దుకాణాలకు అత్యధికంగా టెండర్లు దాఖలు కాగా, ఎనిమిది దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. గతేడాదితో పోల్చితే 528 టెండర్లు అధికంగా వచ్చాయి. కేవలం టెండర్ల రూపేనా రూ.34.53కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లయింది. టెండర్ల ప్రక్రియ ముగియగా, శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో టెండర్లను ఓపెన్ చేసి లాటరీ పద్దతని మద్యం షాపులను కేటాయించనున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో, జగిత్యాల జిల్లాకు సంబంధించి ధరూర్ క్యాంప్‌లోని వాసవి వెల్ఫేర్ సోసైటీ కళ్యాణ మండపంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి పద్మనాయక కళ్యాణ మండపంలో ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో టెండర్లు ఓపెన్ చేసి లాటరీ ద్వారా పాపులను కేటాయించనున్నారు. ఈ మేరకు నాలుగు జిల్లాల్లో లాటరీ పద్దతిన షాపులను కేటాయించేందుకు ఆబ్కారీ అధికారులు అంతా సిద్ధం చేశారు. మరికొన్ని గంటల్లో లాటరీ ద్వారా మద్యం షాపులు దక్కనుండగా, ఆ అదృష్టం ఎవరిని వరించనుందోనన్న ఉత్కంఠ మద్యం వ్యాపారుల్లో నెలకొనగా, పదుల సంఖ్యలో టెండర్లు దాఖలు చేసిన వ్యాపారులు అందులో ఒకట్రెండు దుకాణాలైన దక్కకపోతాయా అన్న ఆశతో ఉన్నారు. ఇక ఆ కిక్కు లక్కు ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే!