కరీంనగర్

స్వచ్ఛదర్పణ్ అవార్డుపై కలెక్టర్‌కి ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 25: స్వచ్ఛదర్పణ్‌లో జిల్లాకు దేశ వ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌కు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కలెక్టరేట్‌లో మొ క్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వా రిలో డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, డిఆర్‌డివో బి.రవీందర్, తదితరులున్నారు.
జగిత్యాల రూరల్: స్వచ్ఛదర్పణ్‌లో జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు గుర్తింపు రావడం చాలా గర్వంగా ఉందని కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నా రు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ప్రజలకు చేరువ కావాలని, సామాన్యులకు మెరుగైన సేవలు అందించాలనే సిఎం కెసిఆర్ ఆలోచన విధానంతో జిల్లా యంత్రాంగం ముందుగు సాగడం వల్లే జగిత్యాల జిల్లాకు జాతీయ స్థా యిలో గుర్తింపులభించిందన్నారు. చిన్న జిల్లాలతోనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లా ఏర్పడిన వంద రోజుల్లో విద్యా, వైద్యం, స్వచ్ఛ భారత్ , మరుగు దొడ్ల నిర్మాణాలపై దృష్టిసారించి కార్యక్రమాలను విజయవంతం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో 25శాతం ఉన్న సాధారణ ప్రసూతిల అవగాహన కల్పిస్తునే కెసిఆర్ కిట్‌ల ద్వారా ప్రస్తుతం 65 శాతం వరకు పెంచినట్లు తెలిపారు. హరిత హారంలో హరిత రక్ష దళాలను ఏర్పాటు చేయడంలో సైతం జగిత్యాల జిల్లా ముందుందన్నారు. కార్యక్ర మంలో అధికారులున్నారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం
* కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 25: నేరెళ్ళ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభు త్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని, పిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ స్పష్టం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట వారం రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా సోమవా రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ వారినే అ ణిచేస్తూ,రాష్ట్రం నుంచి పారదోలే యత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. దళితుల సంక్షేమపథకాలు తమ పార్టీ కార్యకర్తలకే అప్పగిస్తూ, రాష్ట్రంలోమాఫియాల ముఠాలను ప్రోత్సహిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజాసంక్షేమం గాలికొదిలి తరాల పాటు తన కుటుంబం తినగలిగేలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని దుమ్మెత్తిపోశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తూ, దళిత సంక్షేమం అటకెక్కించాడని ఆరోపించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తూ, నాటి రజాకార్ల తీరును తలపిస్తున్నాడని, నాటి నైజాంకు ప్రతిరూపంగా మారి రాష్ట్రాన్ని వల్లకాడులా మా ర్చుతున్నాడని ధ్వజమెత్తారు. శిబిరాన్ని కాంగ్రెస్ రాష్టన్రేత చలిమెడ లక్ష్మినర్సింహారావు ప్రారంభించగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, చెర్ల పద్మదానయ్యయాదవ్, నిఖిల్ చక్రవర్తి, ఉప్పరి రవి, పడాల శంకరయ్య, పోతారపు సురేందర్, తాళ్ళపల్లి అంజయ్యగౌడ్, పాల్ ప్రవీన్, పలువురు పాల్గొన్నారు.