కరీంనగర్

అభివృద్ధి చూడలేకనే ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, సెప్టెంబర్ 25: ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చూడలేకనే కాంగ్రెస్ వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేస్తూ అన్ని రంగాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుండడంతో ఇది చూడలేకనే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.సమావేశంలో టిఆర్‌ఎస్ నేతలు గడ్డం సత్యనారాయణ గౌడ్, కాంపెల్లి నారాయణ, బైరం రమేష్, వెంకటాచారి, జావీద్, పలువురు ఉన్నారు.
శవంపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు
* టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు
మానకొండూర్, సెప్టెంబర్ 25: మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టిడిపి, కాంగ్రెస్ నాయకులు శవంపై రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు అలువాల కోటి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోటి, ఎఎంసీ ఛైర్మన్ మల్లగల్ల నగేష్ మాట్లాడుతూ గూడెంకు చెందిన శ్రీనివాస్ ఆత్మహత్యయత్నం చేసుకుంటే హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో మంత్రి హరిష్‌రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఓరుగంటి ఆ నంద్ ప్రతి క్షణం వారి ఆరోగ్యం బాగుపడాలని కృషి చేస్తు సుమారు 50 లక్షల రూపాయాలను వైద్య కోసం ఖర్చుచేసినప్పటికి ఆరోగ్యం కుదుట పడక దళిత సోదరుడైన శ్రీనివాస్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. సమావేశంలో ఎంపిపి లింగయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు పారునంది కిషన్, బెజ్జంకి ఎంపిటిసి లింగాల లక్ష్మణ్, జేరిపోతుల మదు, మల్లేషం, రుపేష్, బోల్ల వెంకటస్వామి, కనుకం నాగయ్య, మ్యాకల కుమార్, తిరుపతి, తదిరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ చావుకు రసమయ బాధ్యత వహించాలి
* టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశం
ముకరంపుర కరీంనగర్, సెప్టెంబర్ 25: మాంకాళి శ్రీనివాస్ చావుకు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశం, నగర టిడిపి అధ్యక్షుడు కల్యాడపు ఆగయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒక యువకుడి చావుకు కారణమైన బాలకిషన్ ఎంత మాత్రం క్షమార్హుడు కాడని ఆయన పేర్కొన్నారు. రసమయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని పక్షంలో కెసిఆర్ జోక్యం చేసుకొని ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.