కరీంనగర్

ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, డిసెంబర్ 19: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆలయం విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి తారకరామారావు చెప్పారు. వందశాతం మురుగుదొడ్లు నిర్మించి రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గం మూడో స్థానం దక్కించుకున్న సందర్భంగా శనివారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాక్షేత్రమైన వేములవాడను యాదాద్రి మాదిరిగా అభివృద్ధి చేస్తామని, అందుకు అవసరమైయ్యే నిధులను ప్రభుత్వ పరంగా దశల వారిగా మంజూరి చేస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిందని, పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆంధ్రవలసవాదుల పాలనలో సాక్షాత్తు ఆ పరమశివుడిపై కూడా అసత్యప్రచారాలను చేశారు. అలాంటి దుష్ప్రచారాలను ముఖ్యమంత్రి తిప్పికొట్టేందుకు వేములవాడలోనే ఒక్కరోజూ పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. వేములవాడ నియోజకవర్గ రహదారుల అభివృద్ధి కోసం రూ.5కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. బహిరంగ మలమూత్ర విసర్జనలు లేకుండా చేయాలనే సంకల్పంతో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకువచ్చారని అన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా సిరిసిల్లను వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తే, అదే స్ఫూర్తితో వేములవాడ నియోజకవర్గం కూడా పోటీ పడి 19వేల 500 టాయిలెంట్లను నిర్మించి రాష్ట్రంలో మూడవస్థానం దక్కించుకున్నదని అభినందించారు. ప్రజలు,అధికారులు, ఎమ్మెల్యే సహకారం,సమిష్టి కృషి తోనే ఇదీ సాధ్యమైందని అన్నారు.అంతేకాకుండా పల్లెల అభివృద్ధికి పన్నుల వసూలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నామని,అదీ కూడా సిరిసిల్ల నియోజకవర్గం నుంచే ప్రారంభించామని, ఇప్పటి వరకూ నియోజకవర్గంలో 95శాతం పన్నులు వసూలు చేశామని మరో ఐదు శాతం పన్ను వసూలు చేసి వందశాతం పన్నులు వసూలు చేసిన నియోజకవర్గంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంటామని ప్రకటించారు. ఎల్లపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా వేములవాడ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని,సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ పట్టణానికి కుళాయిల ద్వారా ఒకేసారి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

స్కూల్ ఆటో బోల్తాపడి విద్యార్థులకు గాయాలు
* ఒకరి పరిస్థితి విషమం
పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 19: మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వెళ్తున్న స్కూల్ ఆటో సబ్బితం గ్రామం వద్ద బోల్తా పడిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. ఈ సంఘటనలో గణేష్, వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, వీరిని వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గణేష్ అనే విద్యార్థి తలకు బలమైన గాయాలు కావడంతో డాక్టర్ల సూచన మేరకు అతన్ని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. వైష్ణవి అనే విద్యార్థిని చేయి విరగడంతో వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. రంగాపూర్ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల విద్యాభ్యాసం నిమిత్తం ప్రతి రోజు వెళ్తుంటారు. శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన ఆటోకు ఒక సైకిల్ అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బొల్తా పడింది. దీనితో స్థానికులు గమనించి వెంటనే గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు బసంత్‌నగర్ ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.