కరీంనగర్

చిన్నముల్కనూరు వద్ద రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, సెప్టెంబర్25: మండలంలోని చిన్నముల్కనూరు మెయిన్ రోడ్‌పై సోమవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రా మానికి చెందిన కోల సిరిచందన (6) అనే బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. బంధువులు, గ్రామస్థుల కథనం ప్రకారం..బతుకమ్మ పండుగ కోసం పొట్లపల్లి నుంచి సోమవారం సాయంత్రం అమ్మమ్మగారి ఊరైన చిన్నముల్కనూరుకు సిరిచందన తన తల్లిదండ్రులైన నిర్మల, శంకర్‌తో కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో బస్సు దిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న ఎపి.15జడ్. 0103 అనే నంబర్ గల బస్సు ఎదురుగా సిరిచందనను ఢీకొట్టి సిరిచందన తల పై నుంచి టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు, బంధువులు అదే రోడ్డుపై ధర్నా, రాస్తారోకోకు పూనుకున్నారు. మూడు గంటల పాటు ఆందోళనకారులు ధర్నాను విరమింపకపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. తిమ్మాపూర్, గనే్నరువరం ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, కోటేశ్వర్‌లు ఆందోళనకారులను సర్ధిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అని ఆందోళన కొనసాగిస్తున్నారు. హుస్నాబాద్ డిపో మేనేజర్ సంఘటనా స్థలానికి రావాలంటూ ఆందోళనకారులు పట్టుబట్టగా ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఫోన్‌లో డిఎంను సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి చెదురుముదురు ఘటనలకు పాల్పడకుండా నిరోధిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ పాస్‌తో ఇబ్బందులెన్నో
* రేషన్ సరుకులందక కార్డుదారుల పరేషన్
* తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రమేశ్ ఆరోపణ
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 25: పారదర్శకత కోసం రేషన్‌షాపుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానంతోడీలర్లు, వినియోగదారులు అనేక ఇబ్బందుల నెదుర్కొంటున్నారని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గాజె రమేశ్ ఆరోపించా రు. సోమవారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, దొంగ రేషన్‌కార్డులు తొలగించేందుకే బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టినట్లు, వేలి ముద్రలు నమోదు చేయించుకోని వారి కార్డులు తొలగిస్తామని అధికారులు ప్రకటిస్తుండగా కార్డుదారులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరెల కోసం రేషన్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహిళలు, తాజాగా వేలిముద్రల కోసం చౌకధరల షాపుల ఎదుట క్యూలు కడుతూ, అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. గతంలోవెనువెంటనే డీలర్ రేషన్ సరుకులు ఇవ్వగా, బయోమెట్రిక్ విధానంతో ఒక్కొక్కరికి కనీసం 30నిమిషాలు సమయం పడుతుండగా, వినియోగదారులు అనేక ఇక్కట్లపాలవుతున్నారని ఆరోపించారు. సాంకేతిక లోపాలు ఏర్పడుతుండగా రోజుల తరబడి సరుకుల కోసం దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నారని, పండగ సమీపిస్తున్న తరుణంలో సరుకులందక పరేషానవుతున్నారని అన్నారు. సాంకేతిక సమస్యలు అధిగమించేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, మహిళల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. టిడిపి నేతలు ఆడెపు కమలాకర్, నందాల శివ, కె. ఆగయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, దాసరి రామకృష్ణారెడ్డి, ఉల్లందుల నర్సయ్య, మేకల రాయమల్లుతో పాటు పలువురు పాల్గొన్నారు.
భూ సేకరణ పనులు పూర్తిచేయాలి
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్, సెప్టెంబర్ 25: జిల్లాలో ప్రాజెక్టు కింద కాలువల నిర్మాణం పనులకు కావలసిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల నిర్మాణానికి కావలసిన భూమి ఎంత అనేది సంబంధిత ఆర్‌డిఓలకు ఇండెంట్ ఇవ్వాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు. జెసి బద్రి శ్రీనివాస్, డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానమ్, హుజూరాబాద్ ఆర్‌డిఓ చెన్నయ్య, ఇఇ రాములు, ఎడి, తహశీల్దార్లు పాల్గొన్నారు.
మహాయాగంలో కుంకుమార్చనలు
ధర్మపురి, సెప్టెంబర్ 25: ధర్మపురి క్షేత్రస్థ శ్రీరామలింగేశ్వరాలయ ఆవరణలో నిర్వహిస్తున్న శతచండీ మహాయాగం సందర్భంగా సోమవారం మూల విరాట్టుకు మహా రుద్రాభిషేకాలు, యాగశాలలో చండీ హోమం, సువాసినుల సామూహిక కుంకుమార్చనల కార్యక్రమాలను సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ట్రస్టుబోర్డు చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎసి,ఇఓ సుప్రియ, ధర్మకర్తల పర్యవేక్షణలో ప్రముఖ యాజ్ఞికులు మధు శంకరశర్మ ఆచార్యత్వంలో, పాలెపు ప్రవీణ్ శర్మ బ్రహ్మగా, వేదవిదులు మధు సాంబయ్య శర్మ, మధు నటరాజ్ శర్మ, పాలెపు చంద్రవౌళి శర్మ, గుడ్ల రమేశ్, నారంభట్ల ప్రశాంత్ శర్మ, పెంట్యాల అశ్విన్ శర్మ, తాడూరి బలరామశర్మ, ముత్యాల శర్మ, బొజ్జ రాజగోపాల్ శర్మ, నంబి అరుణ్, పాలెపు సందీప్ శర్మ, కొరిడె నరహరి శర్మ, పాలెపు భరత్ శర్మ, దేవళ్ళ సాయిశర్మలు చండీ పారాయణాలు, చతుష్షష్టి పూజ, సప్తశతి పారాయణాలు, స్థాపిత దేవతా హోమాదులను నిర్వహించారు. మధ్యాహ్నం కుంకుమార్చనలు నిర్వహించారు. ధర్మకర్తలు, ధర్మకర్తలు వేంకటేశ్వర్‌రావు, రమాదేవి, నటరాజ్, సునిల్ కుమార్, లింగన్న, భాగ్యలక్ష్మి, ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, ప్రధానార్చకులు రఘునాథాచార్య, సిబ్బంది పాల్గొన్నారు.
త్యాగానికి స్ఫూర్తి ప్రదాత.. హజ్రత్ హుస్సేన్
* ధర్మపురి క్షేత్రంలో మొహర్రం వేడుకలు ప్రారంభం
ధర్మపురి, సెప్టెంబర్ 25: ప్రాచీన పుణ్య తీర్థమైన ధర్మపురి క్షేత్రంలో వారం రోజులపాటు నిర్వహించనున్న మొహర్రం వేడుకలు సోమవారం ప్రారంభమైనాయి. క్షే త్రంలో హిందూ, ముస్లిం సోదరులూ సమష్టిగా జరుపుకోవడంతో ప్రత్యేకత సంతరించుకుంది. స్థానిక ముస్లిం మతపెద్దల కథనం ప్రకారం గో ల్కొండ రాజ్యానే్నలిన మహమ్మద్ కులీ కుతుబ్‌షా (1580-1612) పరిపాలనా సమయంలో ధర్మపురి క్షేత్రం లో ఆశూర్‌ఖానా ఏర్పాటు చేసినట్లు చెపుతారు. ఇమాం హుస్సేన్ ఖాసింల పేర పీర్లను నెలకొల్పడం జరిగిందంటారు. రెండు మసీదులకు సంబంధించి వారం రోజులపాటు హిందూ, ముస్లిం సోదరులు కలిసికట్టుగా పీర్లను నెలకొల్పి, చివరి రోజు గోదావరినదికి వేలాదిమంది తోడురాగా వెళ్ళి పరిసమాప్తి గావిస్తారు. పీర్ల పండగ సందర్భంగా సంతానహీనులైన హిందూ స్ర్తిలు మొక్కులు చెల్లించుకోవడం, పులుల మరియు ఇతర వేషాలతో విన్యాసాలు చేస్తూ, ఆడుతూ వారం రోజులు డబ్బులు పోగుచేసుకోవడం క్షేత్రంలోఏటా అనుసరింప బడుతున్న సాంప్రదాయంగా మారింది.