కరీంనగర్

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, అక్టోబర్ 15: జమ్మికుంట పట్టణంలోని గాంధి చౌక్ వద్ద టిఅర్ ఎస్‌వి విద్యార్థి విభాగం,అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం 86వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్టప్రతి కలాం చిత్ర పటానికి పూల మాల వేశారు. ఈ సందర్బంగా సి ఐ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నాత శిఖరాలకు ఎదాగారని కోనియాడారు. కలాం అశాయాలను దేశ యువత కోనసాగించాలని పిలుపు నిచ్చారు.శాస్తవ్రేత్తగా కలాం అవిష్కరణలు దేశ,విదేశాలలో మన్ననలు పోందాయన్నారు. ఈ కార్యక్రమంలో టిఅర్ ఎస్ వి రాష్ట్ర విద్యార్ధి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాం శ్యామ్, వడ్లూరి యాదగిరి, బత్తుల పాండు,సారంగం,వేణు,అంజనేయులు,సంపత్,శ్రీనివాస్,క్రాంతి,దిలీష్‌తో పాటుతదితరులు పాల్గోన్నారు.
పేదలకు వరం...కల్యాణలక్ష్మి పథకం
* ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ నేతృత్వంలో చేపడుతున్న విభిన్న ప్రజాహిత కార్యక్రమాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లు పేదలకు నిజమైన వరాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ధర్మపురి క్షేత్రంలో ధర్మపురి మండలానికి చెందిన 4గురికి, బుగ్గారం మండలానికి సంబంధించిన 10మందికి అర్హులైన పేదలకు ఒక్కక్కరికి 51వేల చొప్పున ప్రభుత్వ సాయంగా కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, వరకట్నపు దురాచారాలకు పెళ్ళిళ్ళు చేయడం తలకు మించిన భారమతుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో లేని విధంగా కుల, మతాలకు అతీతంగా పేదలకు పెళ్ళిళ్ళ నిమిత్తం 51వేలు అందించడం కేసిఆర్ ప్రభుత్వ గొప్పతనమన్నారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించు కోవాలని సూచించారు. ధర్మపురి తహశీల్‌దార్ నవీన్, ఎంపిపి మమతారావు, వైస్ ఎంపిపి అయ్యోరి రాజేశ్ కుమార్, ధర్మపురి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాదినేని రాజేందర్, మండల రైతు సమన్వయకర్త భీమయ్య, మండల తెరాస అధ్యక్షులు మల్లేశం, పట్టణ అధ్యక్షులు మహేశ్, ఎంపిటిసి రమేశ్, విజయలక్ష్మి, కస్తూరి రాధ, కోఆప్షన్ సభ్యులు ఆసిఫ్, ఉపసర్పంచ్ రామయ్య, ఎసారెస్పీ మాజీ వైస్ చైర్మన్ రాజలింగం, చందయ్యపల్లె సర్పంచ్ కిషన్‌రెడ్డి, నాయకులు కిశోర్‌రావు, గుండయ్య, మురికి శ్రీనివాస్, రెవెన్యూ రెవెన్యూ సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు.