కరీంనగర్

కాలగర్భంలో కలిసిన బ్రిడ్జికి ఇక సెలవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 15: కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాల మద్య ఉన్న శాబాస్‌పల్లి వంతెనకు ఎట్టకేలకు చరమగీతం పాడారు. మిడ్ మానేరులోకి ఎస్పారెస్పీ నుండి నీరు వదులుతున్న నేపథ్యంలో ఈ వంతెన పైనుండి నీరు పారుకం పెరుగుతున్నది. దీనితో వెంతనపై నుండి బస్సులు, వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఏకంగా ఆదివారం శాబాస్‌పల్లి వాగుపై నుండి రాకపోకలు నిలిపివేస్తూ, రోడ్డును మూసి వేశారు. దీనితో ప్రాచీన కాలం నుండి కామారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌ల మద్య వాగుపై రాకపోకలకు వారదిగా ఉన్న వంతెన రోడ్డు మూసివేతతో కాలగర్భంలో కలిసిపోయింది. ఎస్సారెస్పీ వరద కాలువ నుండి విడుదల చేస్తున్న నీరు పారుతూ మూలవాగు ద్వారా మిడ్ మానేరుతో నిండుతున్న విషయం తెలిసిందే. దీనితో మిడ్ మానేరుకు జలకళ ఉట్టిపడడంతో ప్రజలు ఈ దృశ్యాలను తిలకించడానికి భారీగా తరలి వస్తున్నారు. శాబాస్‌పల్లి రోడ్డు వంతెనపై నుండి పారుతున్న నీటిలో ప్రజలు నడుస్తూ, ద్విచక్రవాహనాలతో కాలగర్భంలో కలిసిపోతున్న శాబాస్‌పల్లి వెంతెనపై నుండి మున్ముందు నడవడం సాధ్యం కాదన్న భావంతో చివరి మజిలీగా ఆనందోత్సాహంతో నీటిలో నడిచి వెలుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి విడుదల అవుతున్న నీరు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరులోకి చేరుతుండడంతో క్రమంగా జలకళ పెరుగుతున్న కొద్దీ సందర్శకుల తాకిడి కూడా మరింత పెరుగుతున్నది. కాగా శాబాస్‌పల్లి వాగుపై నుండి నీటి పారకం ఉదృతం అవుతున్న నేపథ్యంలో దీని పక్కనే నిర్మించిన పొడువైన కొత్త వంతెన నిర్మాణం పూర్తి కావడంతో వాహనాల రాకపోకలకు అనుమతించారు. దీనితో శాబాస్‌పల్లి వాగు రోడ్డును మూసి వేశారు. ఇక ప్రాచీన షాబాష్‌పల్లి వాగు రోడ్డు డ్యాం వంతెన కాలగర్భంలో కలిసిపోవడంతో ప్రజలు ఇక సెలవు అని పేర్కొంటున్నారు.

మూఢనమ్మకాలను విడనాడండి..
* కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి
సైదాపూర్, అక్టోబర్ 15: గ్రామాల్లో భానుమతి, చేతబడులను నమ్మరాదని, అవి ఉట్టి భూటకమని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రాయికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి మాట్లాడుతూ సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, గ్రామాలలో మూఢ నమ్మకాలు విడనాడి పరిజ్ఞానంతో ముందుకెల్లాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, హల్మెట్ తప్పకుండా వాడాలని తదితర సూచననలు,సలహాలు ఇచ్చారు.
రాయికల్‌కు ఉన్న విశిష్టతపై గ్రామ పెద్దలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారని ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు. జలపాతంకు వచ్చే సందర్శకులను ఏర్పాట్లుచేస్తు వారిని ఇబ్బందులకు గుర చేయరాదని, పోలీసులకు ప్రజలు సహకరిస్తే అప్పుడే సందర్శకులు ఇబ్బందులు పడరాదన్నారు.
ప్రాంతం అభివృద్ధి చెందితే గ్రామస్థులకు కూడా మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు కళాజాత ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలపై పాటలు, నృత్యాలు, సన్నివేషాలు గ్రామసుథలకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జడ్పీటిసి బిల్ల వెంకటరెడ్డి, సర్పంచ్ జేరిపోతుల పద్మా సుదర్శన్, వైస్ ఎంపిపి ఊచకోయిల ధనలక్ష్మి, రాశవులు, పర్యాటక జిల్లా అధికారి వెంకటేశ్వర్ రావు, హుజూరాబాద్ ఎసిపి మూల రవీందర్ రెడ్డి, హుజూరాబాద్ టౌన్, రూరల్ సిఐలు రమణపూర్తి, రవి కుమార్, సైదాపర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్, రైతు న్వయ మండల కో-ఆర్డినేటర్ రావుల రవీందర్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు మునిగంట స్వామి, నాయకులు శ్రీ్ధర్ రెడ్డి, రమేష్, వివిధ గామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వెరెవెన్యూ సిబ్బంది, జిపి సిబ్బంది, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్‌ఐలు, టాస్క్ఫోర్స్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.