కరీంనగర్

సంచార జాతుల ఆర్థికాభివృద్ధికి రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ,అక్టోబర్ 15: రాష్ట్రంలోని సంచార జాతుల ఆర్థికాభివృద్ధికి పూచికత్తు లేకుండా బ్యాంకుల నుంచి రూ.1లక్ష రుణాలను అందిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారు. ఆదివారం పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన పూసల సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడారు.నోటితో ఉచ్చరించడానికి ఇబ్బందిగా ఉండే కులాలను గుర్తించి రాజ్యంగ సవరణ చేసి ఆ కులాలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పారు.పూల సంఘానికి భవనం ఉంటే నిర్మాణానికి అవసరమైయ్యే నిధులను మంజూరి చేస్తానని,లేకుంటే స్థలాన్ని సైతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.పూల సంఘం హక్కులను సాధనకు తనవంతుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే రమేశ్‌బాబు చెప్పారు.సంఘ భవన నిర్మాణానికి నిధులను కేటాయిస్తానని చెప్పారు.

ఆ డివిజన్ గ్రీన్ జోన్
* సిసి రోడ్లు..రోడ్డుకిరువైపుల చెట్లు* సొంత ఖర్చులు..ప్రజల భాగస్వామ్యం
* హరిత వనంగా డివిజన్‌లోని పలు కాలనీలు

కరీంనగర్, అక్టోబర్ 15: రాజకీయాలు వృత్తి అయితే సామాజిక సేవా ప్రవృత్తిగా ఎంచుకుని ముందుకు సాగుతున్నారు కరీంనగర్‌లోని 50వ డివిజన్ మాజీ కార్పోరేటర్ వొంటెల సత్యనారాయణరెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు విదేశాల్లో తిరిగిన అనుభవంతో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించిన ఆయన 50వ డివిజన్‌లో ప్రజల సహకారంతో చెట్ల పెంపకాన్ని ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు. డివిజన్‌లోని ప్రజలతో మమేకమవుకుంటూ మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ అటు సొంత ఖర్చులు..ఇటు ప్రజల భాగస్వామ్యంతో వీధివీధిన చెట్లు నాటి డివిజన్‌ను గ్రీన్ డివిజన్‌గా మార్చేశారు. ప్రకృతి విధ్వంసం వల్ల కలిగే అనర్థాలను డివిజన్‌లోని ప్రజలకు వివరించుకుంటూ ప్రతి ఒక్కరిని మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా స్వంత నిధులతో నీరు పోయడం ప్రతి మొక్కకు ట్రీగార్డులు ఏర్పాటు చేయడం లాంటి బృహత్తర కార్యక్రమాన్ని సత్యనారాయణరెడ్డి, అతని సతీమణి 50వ డివిజన్ కార్పోరేటర్ వొంటెల సుమలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు డివిజన్‌లో తన హాయాంలో 5వేలకుపైగా మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చేపడుతున్నారు. ప్రజలకు సేవ చేయడానికి పదవి ఒక ఫ్లాట్ ఫాం అని భావించినప్పటికీ కాలనీవాసులతోపాటు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విశ్రాంత ఉద్యోగులను భాగస్వాములుగా చేసుకొని పచ్చదనాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓ వైపు సిసి రోడ్లు వేయడం..మరోవైపు అదే సిసి రోడ్లపై సైతం మొక్కలు నాటేందుకు సరిపోయేంత గుంతను డిల్లింగ్ ద్వారా తవ్వించి అందులో కొత్త మట్టిని నింపి మొక్కలు నాటి చెట్ల పెంపకాన్ని చేపడుతున్నారు. ఇటువంటి గుంతలకు ఒక్క గుంతకు రూ.80 వరకు ఖర్చు వస్తుండగా ఇప్పటివరకు వందకుపైగా గుంతలు సిమెంటు రోడ్లపై తీయించి మొక్కలు నాటారు. మొక్క నాటడంతోనే బాధ్యత తీరిపోయినట్లు భావించకుండా మొక్కలకు నీరు పోసేందుకు ప్రైవేటు ట్యాంకర్లను ఏర్పాటు చేయించడం. ఇతర ప్రాంతాల నుండి కొత్త మట్టిని తెప్పించి గుంతల్లో నింపడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా నీరు పోయించి మొక్కల పరిరక్షణ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. 50వ డివిజన్‌గా గ్రీన్ జోన్‌గా ఆవిష్కరింపజేయాలనే తన తపనకు తోడు కాలనీవాసుల సహకారంతో నాటిన మొక్కలు ప్రస్తుతం పచ్చని నీడను ఇస్తున్నాయి. ప్రతి వీధిలో ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా మొక్కలు నాటడం, సొంత ఖర్చులతో ట్రీగార్డులు ఏర్పాటు చేయడం, వేసవి కాలంలో మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం, కాలనీవాసుల భాగస్వామ్యంతో మొక్కలు పెంపకం ఒక ఉద్యమంగా కొనసాగుతున్నది. ప్రస్తుతం డివిజన్‌లో వెయ్యికిపైగా ట్రీగార్డులను సత్యనారాయణ రెడ్డి తన స్వంత నిధులతో ఏర్పాటు చేయించారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తాడనే పేరున్న సత్యనారాయణరెడ్డి స్వంత నిధులతో మొక్కలు పెంపకం, గుంతలు తవ్వించడం, చెట్ల ఎదుగుదలకు వర్మి కంపోస్టు ఎరువును వాడటం, ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని పోయించడం వంటి పనులతో 50వ డివిజన్‌ను కరీంనగర్ నగరంలోనే హరిత డివిజన్‌గా మార్చివేశారు. డివిజన్ పరిధిలోని బ్యాంకు కాలనీ, మెహర్‌నగర్, వివేకానందపురి, వీడివోస్ కాలనీ, వాసవినగర్, కీర్తివాడ, వావిలాలపల్లి, ఎస్‌ఆర్‌నగర్ కాలనీలు ఇప్పటికే పచ్చదనంతో నిండిపోయి అలరాడుతున్నాయి. డివిజన్ ప్రజల భాగస్వామ్యం..ఎమ్మెల్యే కమలాకర్ సహకారంతో డివిజన్ పచ్చదనంతో విరాజిల్లడమేకాకుండా అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని 50వ డివిజన్ కార్పోరేటర్ వొంటెల సుమ- సత్యనారాయణరెడ్డిలు ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో అన్నారు.

చిన్న పత్రికల సమస్యల పరిష్కారానికి కృషి
* మీడియా అకాడమీ చైర్మన్ నారాయణ
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 15: చిన్న పత్రికల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మీడియా అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల జర్నలిస్టులకు రెండు రోజులు నిర్వహించిన శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిసాయని, నాలుగు జిల్లాల నుంచి పెద్దఎత్తున పాల్గొని శిక్షణా తరగతులను విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఉర్ధూ జర్నలిస్టులకు కూడా శిక్షణాతరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గ్రామీణ విలేకరులకు హైదరాబాద్‌లో మూడు నెలల పాటు ప్రతీ ఆదివారం సాంకేతిక శిక్షణ ఇచ్చుటకు కోర్సును ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. ఫోటో జర్నలిస్టులకు, వీడియోగ్రాఫర్లకు వృత్తినైపుణ్యం పెంపొందించుటకు తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు సాధించుకున్నామని అన్నారు. అలాగే ఇండ్ల స్థలాలను కూడా మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.
శిక్షణకు హాజరైన జర్నలిస్టులందరికి సర్ట్ఫికేట్లను, మెమోంటోలను అందజేశారు.
ఉదయం వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ మాట్లాడుతూ చిన్న జిల్లాల ద్వారా పరిపాలన సౌలభ్యం పెరిగిందని, సమస్యలు తగ్గాయని, వేగవంతంగా జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి సెక్రెటరీ రాజవౌళి, సమాచార శాఖ ఉపసంచాలకులు వెంకటేశ్వర్ రావు, డివిజనల్ పిఆర్‌ఓ ఎస్.కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.