కరీంనగర్

కాంగ్రెస్ వైపు ‘కవ్వంపల్లి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, అక్టోబర్ 22: మానకొండూర్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి, జిల్లా టిడిపి అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. డాక్టర్ వృత్తిలో ఉండి 2009లో రాజకీయ ఆరంగ్రేటం చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆరెపల్లి మోహన్ చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం కొద్ది రోజులకు టిడిపి పార్టీలో చేరి 2014లో టిడిపి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతిలో ఓటమిపాలై నియోజకవర్గంలో, జిల్లాలో టిడిపిని మరింత బలోపేతం చేసేందుకు తనదైన శైలిలో కృషి చేయడమే కాకుండా నియోజవర్గంలోని వివిధ గ్రామాలలో ఉచిత వైద్యశిభిరాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించారు. అప్పటి నుండి నేటి వరకు టిడిపిలో కొనసాగుతూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో నిమగ్ననమయ్యారు. ఇటీవల టిడిపి వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపి నుండి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారంతో అతని అనుచరునిగా పేరొందిన కవ్వంపల్లి సత్యనారాయణ సైతం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే పుకార్లు నియోజకవర్గంలో వ్యాపించాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల నుండి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల, మండల స్థాయి టిడిపి నాయకులతో టిడిపి నుండి కాంగ్రెస్‌లో చేరే విషయమై ముఖ్య నాయకులతో చర్చిస్తున్నట్లు నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది.
ఏదేమైనా కవ్వంపల్లి సత్యనారాయణ టిడిపి నుండి కాంగ్రెస్‌లో చేరడంతో మానకొండూర్ నియోజకవర్గం నుండి రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందో లేదోననే అనుమానాలు కొందరు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న మాజీ ప్రభుత్వ విప్, అప్పటి డి-లిమిటేషన్ కమిటి మెంబర్, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసిన వ్యక్తిని కాకుండా కవ్వంపల్లి సత్యనారాయణకు కాంగ్రెస్‌లో చేరితే పార్టీ టికెట్ దక్కుతుందో లేదోననే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారం కొద్ది రోజుల్లో బయటపడే అవకాశాలు లేకపోలేదని నియోజకవర్గంలో నలుగురు కలిసిన చోట ఇదే చర్చ కొనసాగుతుంది.
పవర్‌లిఫ్టింగ్‌లో లలిత ప్రతిభ
సుల్తానాబాద్, అక్టోబర్ 22: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ అండర్-19, 63 కిలోల విభాగంలో సుల్తానాబాద్‌లోని ఆరవ వార్డుకు చెందిన చింతల లలిత సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా ఆదివారం వార్డు సభ్యుడు అమిరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో మహిళలు లలితను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళలు రాజేశ్వరి, మాధవి, సుమతి, రాధ, స్వప్న, రమాదేవి, వౌనిక పలువురు పాల్గొన్నారు.

పత్తి రైతులను ఆదుకోవాలి
* బిజెపి రాష్ట్ర నేత ఆది శ్రీనివాస్
చందుర్తి, అక్టోబర్ 22: వర్షాలతో దెబ్బతిన్న పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు రైతులకు చేతికందిన పత్తి తడిసిపోయి రంగు మారడంతో నష్టాల పాలయ్యారని, రంగు మారిన పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.4 వేల మద్ధతు ధర చెల్లించాలన్నారు. నష్టపోయిన పత్తి రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి కింద ఆర్థిక సహాయాన్ని అందజేయాలన్నారు. అలాగే వెంటనే సాగునీటిని అందించి రైతుల పొలాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ అంచ రాంరెడ్డి, వైస్ చైర్మన్ చింతపంటి రామస్వామి, నాయకులు పొద్దుపొడుపు లింగారెడ్డి, నేతికుంట జలపతి, దారం హన్మంత రెడ్డి, శంకర్ రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు.