కరీంనగర్

1,30 లక్షల గుట్కాను పట్టుకున్న టాస్క్‌పోర్స్ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, అక్టోబర్ 22: గనే్నరువరం మండలం గుండ్లపాడులో గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి, సప్లై చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని లక్షా 30 వేల రూపాయల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకొని గనే్నరువరం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..గనే్నరువరం మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన పోతుగంటి నరేష్ తన కిరాణం షాపులో గుట్కా అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ దాడి చేయగా అతని వద్ద గుట్కా స్వాధీనం చేసుకొని అతనికి సప్లై చేస్తున్న కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన మోరాంశెట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద దాదాపు లక్షా 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వారికి సప్లై చేస్తున్న వారి వివరాలు సేకరించి, వారిని, సీజ్ చేసిన గుట్కాతో యుక్తంగా గనే్నరువరం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిఐ గౌస్‌బాబా, ఎస్‌ఐలు కిరణ్, నాగరాజు, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

రైతుల సమస్యలపై ప్రణాళిక లేని ప్రభుత్వం
* నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
* బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 22: రైతుల సమస్యలపై సరైన ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సరైన సమయంలో సాగు నీరు విడుదల చేయక పోవడంతో పాటు అకాల వర్షం వల్ల పెద్దపల్లి జిల్లాలో అపార పంట నష్ట వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పాలితం, హన్మంతునిపేట గ్రామాల్లో అకాల వర్షం కారణంగా నష్ట పోయిన పంటలను బిజెపి నాయకుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంపై వెంటనే సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షం వల్ల కలర్ మారిన పత్తి, వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతు యూనిట్‌గా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం వినియోగించేకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ పథకం గురించి రైతులను చైతన్యం చేయలేదని, దీనితో చాలా మంది బీమా సౌకర్యానికి దూరమయ్యారని, ఫసల్ బీమా చేయించి ఉంటే జరిగిన నష్టానికి బీమా లభించి ఉండేదన్నారు. 20 వేల రూపాయల కౌల్ చెల్లించి, మరో 20 వేల రూపాయల పెట్టుబడితో పత్తి పంట సాగు చేస్తే అకాల వర్షం వల్ల పెట్టుబడి కూడా రాని పరస్థితి కౌలు రైతులకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్, రైతులు నష్టాలలో కూరుకు పోతే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు, వరద కాల్వ ద్వారా నీరును వేరే చోటకు తరలించడం వల్ల డి-83, డి-86 కాల్వ పరిధిలో పంటలు సాగు చేసిన పంటలకు సకాలంలో నీరు అందక రైతులు నష్టపోయారని తెలిపారు. ఎసారెస్పీ నీరు వాటాను ప్రభుత్వం ఇష్టానుసారం వినియోగించడం వల్ల కాల్వలపై ఆధార పడిన రైతులు నష్ట అన్యాయానికి గురవుతున్నారన్నారు. రైతులకు ఇలాంటి పరస్థితి ఏర్పడినప్పుడు వెన్నంటి ఉండి పరిహారం అందించడానికి కృషి చేయాల్సిన రైతు సమన్వయ కమిటీలు ఏమి చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామని ఈ కార్యక్రమానికి రైతులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రైతు సమస్యలపై ఉద్యమించడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చిన వారితో కలసి ఉద్యమించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, నాయకులు మీస అర్జున్ రావు, కన్నం అంజయ్య, పుట్ట మొండయ్య, కాసర్ల తిరుపతి రెడ్డి, కేశవరావు, రావుల రాజేందర్, ఎస్.కుమార్, పిన్నింటి రాజు, పల్లె సదానందం, సమ్మయ్య, అక్కెపల్లి క్రాంతి, ఓదెలు, సతీష్, జక్కుల నరహరి తదితరులు పాల్గొన్నారు.