కరీంనగర్

ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, అక్టోబర్ 22: అక్రమంగా ఇసుక రవాణా బహిర్గతంగా జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అక్రమ ఇసుక రవాణాను ప్రభుత్వం ప్రోత్సహించినట్లవుతుందని మాజీ విప్ ఆరెపల్లి మోహన్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కందికట్కూర్ ఎంపిటిసి తిరుపతి తల్లి మృతి చెందగా, ఎంపిటిసిని పరామర్శించారు. తదనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక స్మగ్లర్లకు అండగా నిలిచేటట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటున్నారని, దీంతో ఇసుక తవ్వడం వల్ల మానేరు ప్రాంతంలోని రైతులందరు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. అక్రమ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు ఇప్పటికే 50 శాతానికిపైగా అడుగంటాయని, దీంతో రాను రాను వ్యవసాయ బావుల్లో నీరు లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని అక్రమ రవాణాకు బ్రేక్ పడేలా చూడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోచయ్య, రమేష్, వినయ్ కుమార్ ఉన్నారు.
అక్రమంగా తరలిస్తున్న 20 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఇల్లంతకుంట, అక్టోబర్ 22: మండలంలోని పొత్తూరు పక్కనే ఉన్న మానేరు వాగు నుంచి సిద్ధిపేట తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న 20 ఇసుక ట్రాక్టర్లను ఆదివారం ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పట్టుకున్నారు. ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు రైలు కిందపడి యువకుని మృతి
జమ్మికుంట, అక్టోబర్ 22: ప్రమాదవశాత్తు రైలు నుండి పడి లకిడే చిరంజీవి (32) అనే యువకుడు అదివారం మృతి చెందాడు. బంధవుల కథనం మేరకు మండలంలోని సైదాబాద్ గ్రామనికి చెందిన మృతుడు చిరంజీవి మంచారియాల్ జిల్లా కేంద్రంలో హోటల్‌లో పని చేస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్న బంధువుల ఇంటి వస్తుండగా ,రైలులో డోరు వద్ద ఉన్నాడు. సైదాబాద్ ప్రాంతంలోకాలు జారి కింద పడిపోయాడు. అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య కవిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ
గంగాధర, అక్టోబర్ 22: గంగాధర మండలం బూర్గుపెల్లి శివారులో శనివారం రాత్రి వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడును ద్విచక్ర వాహనదారుడు చోరి చేసినట్లు బాధిత వృద్ధురాలు ఆదివారం గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక ఎస్‌ఐ స్వరూప్ రాజ్ తెలిపిన వివరాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శివనాథుని వెంకటలక్ష్మి (75) అనే వృద్ధురాలు ర్యాలపల్లి గ్రామంలోని తన మనుమరాలి ఇంటికి రాగా, ఆసుపత్రి నిమిత్తం కరీంనగర్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బూర్గుపల్లి బస్టాండ్ వద్ద ఉన్న వృద్ధురాలిని ర్యాలపల్లి వెళ్తున్నానని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని బూరుగుపల్లి చెరువు కట్టవైపు తీసుకవెళ్లి బండిమీది నుంచి కింద తోసేసి పుస్తెలతాడు అపహరించుకుపోయినట్లు తెలిపారు. చీకటి కావడంతో తనకు దారి తెలియకపోగా, ర్యాలపల్లికి చెందిన తన మనుమడు దొంతి వేణుగోపాల్ కేకలు వేస్తూ పిలువడంతో వృద్ధురాలు తన మనుమని గమనించగా రాత్రి ఇంటికి తీసుకెళ్లగా ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కావడంతో ఆదివారం బాధిత వృద్ధురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి
గంగాధర, అక్టోబర్ 22: మండలంలోని ఆసంపల్లి గ్రామానికి చెందిన బూరుగు పోచవ్వ (80) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్‌ఐ స్వరూప్ రాజ్ తెలిపారు. బూరుగు పోచవ్వ తన కూతురు స్వగ్రామం గట్టుబూత్కూర్‌లో గత 12 సంవత్సరాల నుండి నివసిస్తుండగా ఇటీవలనే తన కుమారుడైన బూరుగు లచ్చయ్య ఇంటికి వెళ్లినట్లు, మృతురాలు కూతురు మొండవ్వ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, ఆదివారం ఉదయం తన తల్లి మృతి చెందిన వార్త తనకు తెలుపడంతో వెళ్లి చూడగా చేయి విరగడంతో పాటు మెడపై భాగంలో రక్తస్రావం జరుగుతుందని, తన తల్లిని కొడుకు, కోడలు కలిసి కొట్టి చంపారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.