కరీంనగర్

ఇది ప్రజల ప్రభుత్వం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 22: ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా సిఎం కెసిఆర్ మూడేళ్ల పాలనలోనే కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తూ నగరాభివృద్ధికి కృషిచేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్లు తొలగించిన సందర్భంగా 33కెవి హైటెన్షన్ విద్యుత్ లైన్ల బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విద్యానగర్‌లోని మహాలక్ష్మి పంక్షన్ హాలులో ఎమ్మెల్యే కమలాకర్‌కు అభినందన (సత్కార) సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కరీంనగర్‌లో ఇళ్లపై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ లైన్లతో ప్రజలు వాన పడితే చాలు రాత్రంతా కంటిమీద కనుకులేకుండా భయం గుప్పిట్లో గడిపిన రోజులు ఉన్నాయని, ఈ లైన్ల తొలగింపు గురించి గత పాలకులకు విన్నవించిన పట్టించుకున్నపాపాన పోలేదని ఆరోపించారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వం అర్థం చేసుకుని నగరంలో ఉన్న మొత్తం హైటెన్షన్ విద్యుత్ వైర్ల తొలగింపుకు రూ.22.50కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులతో రోడ్లపై, ఇళ్లపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లు తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యుత్ లైన్ల తొలగింపే కాదు నగరాభివృద్ధికి సిఎం కెసిఆర్ వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, 70యేళ్లల్లో వచ్చిన నిధులకు పది, ఇరవై రేట్లు అధికంగా నిధు లు కెసిఆర్ మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఐటి పార్కు పనులు ప్రార ంభిస్తామని, దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మీ దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వండి..ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేస్తామని కమలాకర్ అన్నా రు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఇ మాధవరావు, ఎడి ఈశ్వరప్రసాద్, కార్పోరేటర్లు లింగయ్య, భాగ్యలక్ష్మిలతోపాటు సంఘం ప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

సిఎం కాళ్లు మొక్కైనా...
రామగుండం జెన్‌కో విస్తరణ చేయస్తా

* 1600 మెగావాట్ల ప్లాంట్‌గా చెప్పించడమే లక్ష్యం
* పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
గోదావరిఖని, అక్టోబర్ 22: ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి సారిగా వెలుగులను ప్రసాదించిన రామగుండం జెన్‌కో థర్మల్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూత పడనివ్వం... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కాళ్లు మొక్కైనా రామగుండం బి థర్మల్ జెన్‌కో కేంద్రంను 1600 మెగవాట్ల ప్లాంట్‌గా విస్తరణ చేయించి తీరుతామని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ రామగుండం ప్రజానీకానికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా నియామకం అయిన సందర్భంగా కోలేటి దామోదర్‌కు రామగుండం పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ రామగుండం వాసినైనా తాను ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ముందుంటానని... బి థర్మల్ విస్తరణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని... 6వేల కోట్లతోనే ఈ ప్లాంట్ విస్తరణ చేయవచ్చునని, జెన్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడటం కూడా జరిగిందని... ఇక్కడ జెన్‌కో ప్లాంట్ విస్తరణ జరిగిన్నట్లయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ విషయంపై సిఎం కెసిఆర్ సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఖచ్చితంగా రామగుండంకు పూర్వ వైభవం తీసుకు వస్తామని కోలేటి దామోదర్ వివరించారు. అదేవిధంగా రామగుండం పెద్ద చెరువు మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మత్తులు జరిపిస్తామని చెప్పారు. రాముని గుండాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ధుతామని స్పష్టం చేస్తూ గ్రూప్‌లకు, రాజకీయాలకు అతీతంగా రామగుండంను ఊహించని రీతిలో అభివృద్ధి చేయడంలో తాను ముందుంటూ... మరో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్ధడమే తమ లక్ష్యమని కోలేటి దామోదర్ అన్నారు. కార్యక్రమంలో రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జడ్పిటిసి కందుల సంధ్యారాణి, టిఆర్‌ఎస్ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు దీటి బాలరాజు, కార్పొరేటర్లు బద్రి రజిత, అభిషేక్ రావు, కుంట సాయి, పాముకుంట్ల భాస్కర్, మల్లేష్ యాదవ్, బుచ్చిరెడ్డి, స్టాలిన్, సర్పంచ్‌లు పల్లె శ్రీనివాస్, మేకల సరస్వతీ మైసయ్య, నాయకులు జహంగీర్, సులోచన, కోలేటి శ్రీనివాస్‌తోపాటు వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొనగా ముందుగా రాజీవ్ రహాదారి నుంచి రామగుండం పట్టణం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
* రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల
హుజూరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పరిధిలోని విద్యను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేటు విద్యను నియంత్రిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణమండపంలో ఆదివారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యారంగ సమస్యలపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల నుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం 500 గురుకుల పాఠశాలలను బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రారంభించిందన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు, విద్యా ప్రమాణాలను కూడా పెంచేందుకు కృషి జరుగుతోందన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేశామని, పాఠశాలల్లో వౌళిక వసతుల కల్పనకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరుగుతోందని, వారిని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి అని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. రాబోయే కాలంలో ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామన్నారు. ఆధునిక పద్దతుల్లో విద్యాబోధనకు కృషి జరుగుతుందని చెప్పారు. డి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్టమ్రని ప్రభుత్వం పేర్కొంటున్నదని, కానీ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఇప్పటి వరకు భర్తీ చేయడం లేదని, నోటిఫికేషన్ కూడా నామమాత్రంగా ఇచ్చారని పేర్కొన్నారు. విద్యారంగానికి అవసరమున్న నిధులు కూడా ప్రభుత్వం కేటాయించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు లభించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 28 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, కానీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేవలం లక్షా 70 వేల మంది మాత్రమే చదువుకుంటున్నట్లు గణాంకాలు చెబుతుతున్నాయన్నారు. నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజాభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రజల చేతుల్లోనుండి పెట్టుబడి దారులు, కార్పోరేట్ సంస్థల చేతుల్లోకి ఎప్పుడో వెళ్లిపోయిందని విమర్శించారు. ప్రభుత్వాల నిర్ణయాలు ప్రపంచబ్యాంక్, ఐ ఎం ఎఫ్‌కు అనుగుణంగా తీసుకుంటున్నారని, అవి చెప్పిన ప్రకారమే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్ విజయ్‌కుమార్, వైస్ ఛైర్మన్ రజిత, డిటిఎఫ్ నాయకులు పల్కల ఈశ్వర్‌రెడ్డి, శ్రీరాంచక్రధర్, ఎం ఈవో శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, నారాయణరెడ్డి, చంద్రవౌళి, జనార్థన్, రవిందర్‌రెడ్డి, శ్యాం, ఈశ్వరయ్య, చంద్ర య్య, సంతోష్‌రెడ్డి, వెంకట్రాములు, ఐలయ్య, ఆంజనేయులు, సత్యనారాయణరెడ్డి, జెఎసి నాయకులు ఆవు సమ్మయ్య, హన్మంతుగౌడ్, సతీష్, వేల్పుల రత్నం పాల్గొన్నారు.

సింగరేణి నీటితో పెంచికల్‌పేట భూములు కళకళ
* మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కమాన్‌పూర్, అక్టోబర్ 22: సింగరేణి సంస్థ ఇవ్వనున్న సాగు నీటితో పెంచికల్‌పేటలోని బీడు భూములు కళకళలాడనున్నాయని మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మండలంలోని పెంచికల్‌పేట శివారులలో ఆదివారం 50లక్షల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో ఓపెన్ కాస్టు నీటి నిలువ కొలను నుంచి పైప్‌లైన్ ద్వారా పెంచికట్‌పేట వ్యవసాయ భూములకు సాగునీరు అందించే కార్యక్రమానికి ఆర్జీ-1, 2 జి ఎంలు విజయపాల్ రెడ్డి, విజయబాబుతో కలిసి పుట్ట మధు, సర్పంచ్ సాగంటి లక్ష్మి, ఎంపిటిసి తాళ్ల శంకర్‌తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మేకల సంపత్ యాదవ్ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాలకు సింగరేణి సంస్థ చేయూత నివ్వాలని, ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు పనులు కల్పించాలని, అలాగే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ సింగరేణి సంస్థ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని సాగునీటిని అందించడంతో సుమారు 150 ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. సంస్థ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని స్పష్టం చేశారు. పెంచికల్‌పేట వాసులకు గోదావరి తాగు నీరు అందించడం జరుగుతుందని, గత ప్రభుత్వాలు ఏనాడు గ్రామాలను పట్టించుకోలేదని అన్నారు. పెద్దంపేట, మంగల్‌పల్లి గ్రామాల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. 60 సంవత్సరాల చరిత్రను టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల్లో తిరగరాసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రతిపాదనలను పంపిచగా సి అండ్ ఎండి శ్రీ్ధర్, డైరెక్టర్ పవిత్రన్ స్పందించి నిధులను మంజూరు చేయడం సింగరేణి చరిత్రలో ఇలాంటిది ఎక్కడా జరగలేదని, కొత్త సంప్రదాయానికి నాంది పలకడం జరుగుతుందని, ఇది చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ మల్క రామస్వామి, నాయకులు ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, పూదరి సత్యనారాయణ గౌడ్, ఐలి శ్రీనివాస్, ఆడేపు రమేష్‌తోపాటు పెంచికల్‌పేట రైతులు పాల్గొన్నారు.

టిడిపి బలహీనపర్చేందుకు కాంగ్రెస్, టిఆర్‌ఎస్ కుట్ర
* పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ తాజోద్దీన్
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 22: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలహీనపర్చేందుకు కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు కుట్ర పన్నాయని తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ తాజోద్దీన్ ఆరోపించారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ మారనున్నారని, తద్వారా పార్టీ తెలంగాణలో ఖాళీ అవుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలను అయోమయానికి గురి చేయడం కోసమే కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు ఈ తరహా ప్రచారానికి ఒడిగడుతున్నాయన్నారు. పతకం ప్రకారమే ఈ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రను భగ్నం చేస్తామన్నారు. పార్టీని బలహీనపర్చే శక్తి ఎవరికి లేదని ఆయన స్పష్టం చేశారు. దివంగత ఎన్‌టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తుందన్నారు. ఆటుపోట్లు రాజకీయ పార్టీలకు సహజమేనని, గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం బలహీనపడలేదు సరికదా మరింత పటిష్టమైందన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రోజు రోజుకు బలపడుతుందని, ఇది ఓర్వలేకనే పార్టీని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఎవరు నమ్మకూడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. పత్రికల్లో వస్తున్న కథనాలన్నీ ఊహాజనితమే తప్పా ఇందులో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కల్యాడపు ఆగయ్య, ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి జాడి బాల్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కొరటాల శివరామకృష్ణ, బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్ట నరేందర్, ఆడెపు కమలాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర సత్యం, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గాజె రమేష్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు బసాలత్ అహ్మద్ ఖాన్, తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు సదుర్ల ఇందు, బలుసుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.