కరీంనగర్

ప్రపంచానికే ఆదర్శం మిషన్ కాకతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, ఏప్రిల్ 10: గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టులాంటివైన చెరువులు, కుంటలకు మహర్థశ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకురావటానికి పూనుకున్న మిషన్ కాకతీయ నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం మండల పరిదిలోని గుమ్లాపూర్, మంగళంపల్లి, రాగంపేట గ్రామాలలో రెండు ఫేస్ కింద మంజూరైన చెరువులకు మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతు ఎన్నో ఏళ్ళుగా గ్రామీణ ప్రజలకు ఆయువుపట్టుగా కొనసాగుతు అటు తాగునీటికి, ఇటు సాగు నీటికి ఎంతో ఉపయోగ పడుతున్న చెరువులు, కుంటలు నేడు నీరు లేక ఎడారులుగా మారుతున్నాయని అందుకే వీటికి జీవం పోయాలని కెసిఆర్ ముందు చూపుతో మిషన్ కాకతీయను అమలు పర్చడంతో ప్రపంచ దేశాల మన్ననలు పొందుతున్నారని, ఎన్నో దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి చిన్న నీటి వనరుకు పూర్వ వైభవాన్ని తీసుకు వస్తామని తెలిపారు. ఒక్క చెరువును, కుంటను వదిలేది లేదని ప్రతి వనరుకు మిషన్ కాకతీయ కిందకు తీసుకువచ్చి నీటి కొరతును తీర్చుతామని, భవిష్యత్ తరాలకు ఇబ్బందులు కలుగకుండా ఉండే విధంగా తీర్చుతామని చెప్పారు. అలాగే రాగంపేట గ్రామంలో సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంబించారు. అనివృద్ది పనుల్లో ప్రతి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పనులను మంజూరి చేయించి, వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గాలన్న, ఎంపిపి గుర్రం భూంరెడ్డి, జడ్‌పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపిపి వెల్మ మల్లారెడ్డి, సర్పంచ్‌లు బత్తిని భూలక్ష్మి-బుచ్చన్న, శంకర్, ప్రభాకర్, ఎంపిటిలు ఎలిగేటి తిరుపతి, స్వప్న, విజయలక్ష్మి, భీమాశ్యాం, చీకట్ల రాజశేఖర్, ఏనుగు రవీందర్ రెడ్డి, మంద నర్సయ్య, బందారపు అజయ్‌కుమార్, నలుమాచు రామక్రిష్ణ, మాచర్ల వినయ్‌కుమార్, సీపెల్లి గంగయ్య, మునిగాల చందు, గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, వెల్మ శ్రీనివాస్ రెడ్డి, దామెర విద్యాసాగర్ రెడ్డి, కొత్త గంగారెడ్డి, గాండ్ల లక్ష్మణ్, చీకట్ల లక్ష్మయ్య, కోమల్ల రాజేశం, రాపెల్లి ఐలయ్యయాదవ్, సుద్దాల శ్రీనివాస్, మచ్చ రమేష్ పాల్గొన్నారు.