కరీంనగర్

ఘరానా మోసగాడికి జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీగల్ కరీంనగర్, నవంబర్ 17: బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే ఖాతాదారులతో కుమ్మక్కై బ్యాంక్‌నే మోసగించిన ఘరాన మోసగాడు, బ్యాంక్ ఉద్యోగి అయిన కొత్తపేట రాజయ్యకు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.శ్రీనివాస్ శుక్రవారం మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నగరంలోని మంకమ్మతోటలో గల కేంద్ర సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో పట్టణానికి చెందిన అడిగొప్పుల లక్ష్మిరాజం, రా ములు, గోలి వెంకటేశం, పి.రాములు ఖాతాదారులుగా ఉన్నారు. వీరంతా కలిసి 52 బ్యాంక్ చెక్కులు డబ్బులు చెల్లించుటకు ఇతర బ్యాంకులకు ఇచ్చారు. కాగా, లక్ష్మిరాజం లక్షా 83 వేలు, రాములు 4 లక్షల 7 వేల 900 రూపాయలు, వెంకటేశం 18 వేలు, పి.రాములు 19 లక్షల 85 వేల 550 రూపాయలు వీరంతా ఇతరులకు చెక్కులు ఇవ్వగా, వారు వేర్వేరు బ్యాంకుల నుండి డబ్బు పొందుటకు ఆయా చెక్కులను జమ చేశారు.
వీటిని క్లియరింగ్ కోసం స్టేట్ బ్యాంక్ కెడిసిసి మెయిన్ బ్రాంచ్‌కి పంపించారు. మంకమ్మతోట బ్రాంచ్ లో పనిచేస్తున్న కొత్తపేట రాజయ్య మెయిన్ బ్రాంచ్ నుండి ఆయా చెక్కులను తీసుకువెళ్లి తమ వద్ద ఉంచుకున్నాడు. 24 గంటలు గడిచినప్పటికీ సంబంధిత కార్యాలయం నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో చెల్లింపు డబ్బులను మెయిన్ బ్రాంచ్ చెల్లింపు చేశారు. కొంత కాలం తరువాత బ్యాంకులో ఆడిట్ జరుగడంతో లెక్కలో తేడా కనిపించింది. దీనిపై అధికారులు దర్యాప్తు జరుపడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగి సహకారంతో ఖాతాదారులు చెక్కులు ఇవ్వగా వాటి చెల్లింపు జరిగినట్లు దర్యాప్తులో వెళ్లడైంది. దీనిపై బ్యాంక్ జనరల్ మేనేజర్ విశ్వనాథం కరీంనగర్ ఒకటవ పట్టణ పో లీస్ స్టేషన్‌లో 21.9.2003లో బ్యాంక్ ఉద్యోగి అయిన రాజయ్యతో పాటు ఆయా నలుగురిపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బ్యాంక్ ఉద్యోగి అయిన రాజయ్యతో పాటు ఆయా నలుగురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు పంపారు. అనంతరం చార్జిషీట్ దాఖలు చేసి సాక్షులను ప్రవేశపెట్టారు. కేసుపై తగిన సాక్షాదారాలను పరిశీలించిన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ నిందితుడైన బ్యాంక్ ఉద్యోగి రాజయ్యపై మాత్రమే నేరం రుజువు కావడంతో మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కాగా, ఈ కేసులో ముద్దాయి అయిన లక్ష్మిరాజం మరణించగా, మిగతా నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు.