కరీంనగర్

వైభవంగా వెంకన్న మహా క్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 17: కార్తీక మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం నేపథ్యంలో, దేవస్థానంలోని వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలొనరించారు. కార్తీక మాసం, అం దునా శుక్రవారం సంబరాలలో అంబర చుం బిత భక్తి భావంతో భాగస్వాములైనారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర ఆలయంలో మహా క్షీరాభిషేక, లక్ష్మీహోమాలు, లక్ష్మీసూక్త హవనాలను గావించారు. దేవస్థానం ఎసి, ఇఓ సుప్రియ, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తలు, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, ఆలయ అర్చకులు ప్రత్యేక సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానంగా నదితీరాన గల శ్రీసంతోషిమాత ఆలయంలో, మహాలక్ష్మి మందిరంలో మహిళలు అధిక సంఖ్యలో ప్రత్యేక అమ్మవార్ల పూజాదులలో పాల్గొన్నారు. వాసవీ మాతకు శ్రీసూక్త ప్రత్యేక పూజాదులను నిర్వహించారు.
శ్రీ్ధర్‌బాబును విమర్శించే స్థాయి రఘువీర్‌సింగ్‌కు లేదు
* యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నర్సింగ్
పెద్దపల్లి, నవంబర్ 17: మాజీమంత్రీ దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబును విమర్శించే స్థాయి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్‌కు లేదని యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు మంథని నర్సింగ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిచెర్ల బొగ్గుగనులలో నష్టపోయిన ప్రజలకు ముందుండి పూర్తిగా నష్టపరిహారం ఇ ప్పించిన ఘనత శ్రీ్ధర్‌బాబుకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని, ఆప్రాజెక్టులను అడ్డుకుంటున్నది కాంగ్రెస్‌పార్టీయేనని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టులలో రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పక్షాణ పోరాడితే ప్రాజెక్టులను అడ్డుకున్నట్టేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయంలో నీకు సెన్సార్‌బోర్డు సభ్యుడ్ని చేసిన ఘనత శ్రీ్ధర్‌బాబు కాదా...అని గుర్తుచేశారు. కార్యక్రమంలో భూషనవేని సురేష్‌గౌడ్, బండారి సునిల్‌గౌడ్, గంగుల సంతోష్, కుంభం సంతోష్, ట్యాంక్ జయదేవ్, పూరేళ్ల శ్రీనివాస్, బండీ సతీష్, చుంచు శ్రీకాంత్, బండి అనిల్‌తో పాటు తదితరులు పాల్గోన్నారు.