కరీంనగర్

తెలుగు భాష.. అమ్మభాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, నవంబర్ 18: అమ్మ పలుకు కమ్మదనం, అమ్మ భాషా అర్ధవంతమైన జీవితపు భాషా, తెలుగు భాషాను బిసి కమీషన్ రాష్ట్ర కమీటి చైర్మన్ బి.ఎస్.రాములు పొగిడారు. శనివారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా సాహిత్యోత్సవం సదుస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా రాములు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత నలిమెల భాస్కర్ ముఖ్య అతిధులుగా హజరై మాట్లాడుతూ తెలంగాణలో మన పెద్దలు ఉపయోగించిన పదమే సాహిత్యంతో కూడుకుని ఉంటుందన్నారు. తెలంగాణ భాషాను పునర్జీవింప చేసుకోవాలని సూచించారు. ఉహ నుండే సాహిత్యం పుడుతుందన్నారు. తెలుగు స్వతంత్ర భాష అన్నారు. 11వ శతాబ్ధంలో నన్నయ్య మహ కవి రాసారన్నారు. కార్యక్రమంలో సాహిత్య గౌతమి అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రిన్సిపాల్ రామకృష్ణ, సోషల్ వేల్పేర్ ఆఫీసర్ సరోజనతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయమే లక్ష్యంగా పనిచేయాలి
* బీజేపీ రాష్ట్ర నేత అర్జున్ రావు
సుల్తానాబాద్, నవంబర్ 18: రాబోయే 2019 ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నేత మీస అర్జున్ రావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటలో మండల కార్యవర్గ సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము తిరుపతి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అర్జున్‌రావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన తిరుగుతూ కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చింతల లింగారెడ్డి, కర్రె సంజీవరెడ్డి, ఆది కేశవరావు, పడాల అశోక్‌కుమార్, లంక శంకర్, తోట రాంరెడ్డి, శాత్రాజ్ రమేశ్, గడ్డం మహిపాల్‌రెడ్డి, బాలసాని సదయ్య, తదితరులు పాల్గొన్నారు.