కరీంనగర్

రాజన్న సేవలో చాగంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ,నవంబర్ 18: రాజరాజేశ్వరస్వామిని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావుశనివారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలోకి రాగానే ఇవో రాజేశ్వర్, వేదపండితులు ఆయనకు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అంతరాయంలోని స్వామివార్లను,అమ్మవారిని దర్శించుకున్నారు.అక్కడి నుంచి సీతారామాంజనేయ,అనంత పద్మనాభస్వామివార్లను దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
ఆకట్టుకున్న శిశతత్వ ప్రవచనాలు
శివతత్వంపై ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావుప్రవచనాలు భక్తులను ,పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. స్థానిక శ్రీ రాజరాజేశ్వరుడి తత్వంపై,శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి మహిమాన్వితాల ఆధ్యాత్మిక విషయాలను గోప్పగా వివరించారు.రెండుగంటలకు పైగా ఆయన ప్రవచనాలు వివరిస్తూంటే భక్తులు,ప్రజలు ఆయన మాటలకు మంత్రముగ్దులై విన్నారు.
హెచ్‌ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
* ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
గంభీరావుపేట, నవంబర్ 18: కల్యాణలక్ష్మీ ధ్రువీకరణ పత్రం పై సంతకం చేసిన గంభీరావుపేట మండలం లింగన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈసరి రవీందర్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు శనివారం డిమాండ్ చేశాయి. మండలంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు సస్పెన్షన్‌పై మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కళ్యాణలక్ష్మీ కోసం దృవీకరణ పత్రంపై గెజిటెడ్ సంతకం చేసినందుకు క్రమ శిక్షణ చర్యల కింద హెచ్‌ఎంను సస్పెన్షన్ చేయడం దారుణమన్నారు. మండల, గ్రామ స్థాయి అధికారులను వదిలేసి సంబంధంలేని హెచ్‌ఎంపై వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యా య సంఘాల నాయకులు బంతిలాల్, గంద్యాడపు శ్రీనివాస్, సంటి గంగారాం, లక్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శనిగరపు ఆనందం. బాల్‌రాజుతో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.