కరీంనగర్

నూతన సాగు పద్ధతులతో అధిక దిగుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, నవంబర్ 18: వర్షాభావ పరస్థితులు, చీడపీడల సమస్యల నేపథ్యంలో పంటల సాగులో దిగబడులు తగ్గిపోయి నష్టాలు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన పద్ధతులు అనుసరించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సూచించారు. ఎప్పుడు ఒకే రకమైన పంటల సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి అధిక దిగబడులు సాధించి, లాభాలు ఆర్జీంచేందుకు కొత్త ధోరణిలో పంటలు సాగు చేయాలన్నారు. మండలంలోని కాసులపల్లి గ్రామంలో తన సొంత భూమిలో ఇజ్రాయిల్ దేశంలో మాదిరిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సాగు చేసిన వరి పంటను వ్యవసాయ శాస్తవ్రేత్తల బృందం జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలసి శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఇజ్రాయిల్ దేశం వెళ్లినప్పుడు అక్కడ వ్యవసాయ సాగు పద్ధతులను పరిశీలించినట్టు తెలిపారు. అక్కడ మిషన్లతో విస్తృత వ్యవసాయం చేస్తారని, తక్కువ నీరు, పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించడాన్ని తాను గమనించినట్టు చెప్పారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, కూలీల సమస్యకు తోడు పెరిగి పోతున్న పెట్టుబడుల దృష్ట్యా అదే రీతిలో ఇక్కడ పంటలు సాగు చేసి, ఇతరుల రైతులకు కూడా అవగాహన కల్పించి, పద్ధతిలో సాగు చేయించాలలనే ఆలోచనకు వచ్చినట్టు పేర్కోన్నారు. దీనితో ఈ ఖరీఫ్ సీజన్‌లో తన నాలుగు ఎకరాల భూమిలో ఏరోబిక్ పద్ధతిలో వరి పంట సాగుకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. దీని వల్ల తక్కువ నీరు వినియోగంతో పాటు తక్కువ పెట్టుబడులతో, కూలీలతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు వీలుంటుందన్నారు. అంతకు ముందు వ్యవసాయ శాస్తవ్రేత్తలు నూతన సాగు పద్ధతులు, సాగులో మెళుకువలు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే కొత్త విత్తనాలు, సాగు వల్ల కలిగే లాభాలు, ఏ కాలంలో ఏ పంటలు సాగు చేస్తే దిగబడి పెంచుకోవచ్చు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు రాంగోపాల్ వర్మ, దామోదర్ రాజు, శ్రీ్ధర్ సిద్ధి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల్ ప్రసాద్, ఎడిఎ జాకీర్ అలీ, ఎవోలు ప్రకాశ్, సురేందర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు దాసరి చంద్రారెడ్డి, సర్పంచు ఇనుగాల తిరుపతి రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల వ్యవసాయ మర్కెట్ కమిటీ చైర్మన్లు రాంచంద్రారెడ్డి, అల్లా రాజిరెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.