కరీంనగర్

ప్రజలకు సేవ చేసేవాడే నిజమైన నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక, నవంబర్ 19: నిత్యం ప్ర జల్లో ఉంటూ వారి సమస్యలు తీర్చు తూ పనిచేసేవాడే నిజమైన నాయకుడని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం వీణవంక మండలం కోర్కల్ గ్రామ శివారు మానేరు వాగుపై రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యాంకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హాజరైన మంత్రి ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ రైతులకు పశువులు, పంటలు సంమృద్ధిగా ఉంటే ఆనందిస్తారని, వాటికి నష్టం జరిగితే ఏడుస్తారని, ఈ రెండు నీటిపై ఆధారపడి ఉంటాయని, అందుకే నిర్మించనున్న చెక్ డ్యాంలు దోహదపడతాయన్నారు. ఇక్కడి ప్రజలు చెక్ డ్యాంలను నాణ్యతతో నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎంపి బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ నిధులు, నీరు, నియామకాల కోసం తెలంగాణను పోరాడి తెచ్చుకున్నామని, నీటి విషయంలో ప్రజలకు కావాల్సిన నీరు వృథా పోకుండా చెక్ డ్యాంలు నిర్మించడం జరుగుతుందన్నారు. నీరు నిల్వ ఉండడం వల్ల పంటలు పరిపుష్టిగా పండించవచ్చని, దీనికి అదనంగా ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా రైతులకు వ్యవసా యం కోసం అందిస్తుందని గుర్తుచే శారు. రోజుకు ప్రజల కోసం 12 గంట లు పనిచేసే నాయకులు ఉన్నారని, రా ష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గం ఇదే తరహాలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఆదేశంతో ఢిల్లీలో మా వంతు బాధ్యతగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపిపి కర్ర జయ, జడ్పీటిసి ప్రభాకర్, సర్పంచ్ లక్ష్మితోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలంలోని కొత్తపల్లి- మల్కాపూర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి పరామర్శించారు. ఆదివారం ఉదయం చామన్‌పల్లి గ్రామానికి కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగు ల కమలాకర్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని పథకాలు వర్తించేలా చూస్తామని హమీ ఇచ్చారు. అందరు నిరుపేదలేనని, పొట్టకూటికో సం పత్తి ఎరడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెంద డం కలిచివేసిందన్నారు. కార్యక్రమంలో ఐడిసి చైర్మన్ శంకర్‌రెడ్డి, కార్పొరేటర్‌లు, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి
హుజూరాబాద్: డాక్టర్ బి. ఆర్. అం బేద్కర్ కలలుకన్న అసమానతలు లేని సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ మండలంలోని దమ్మక్కపేట గ్రామంలో మంత్రి ఈటల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నగర పంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ ఛైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, జెడ్పీటీసీ సరోజన, మండల ఉపాధ్యక్షుడు బావు తిరుపతి, సర్పంచ్ కొండల్‌రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు పాక సతీష్, వేల్పుల రత్నం, ప్రభాకర్ , తదితరులు పాల్గొన్నారు.
రెండు పంటలకు నీరు అందిస్తాం
జమ్మికుంట: రైతాంగం చిరకాల వాంఛ, సాగుకు నీరు అందించేందుకు, మానేరు నీటితో సాగుకు రెండు పంటలకు నీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, ఫౌర సరఫరా శాఖ మంత్రి ఈటల రా జేందర్ అన్నారు. జమ్మికుంట మండలంలోని విలాసాగర్,వావిలాల మానే రు వాగుపై భూగర్బ జలాల నీటిని నిలువ చేసేందకు చెక్ డ్యాంమ్‌ల నిర్మాణం కోసం మంత్రి ఈటల రాజేందర్, ఎంపి వినోద్‌కుమార్ చేతుల మీదుగా ఆదివారం శంకుస్థాపనలు చేశారు.