కరీంనగర్

చెరకు రైతుల దీక్షలకు సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి, నవంబర్ 19: చెరకు రై తుల దీక్షలకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన మెట్‌పల్లిలోని పాత బస్టాండ్ లో ముత్యంపేట, నిజాం చక్కెర ఫ్యా క్టరీ తెరిపించాలని చెరకు రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. సిఎం ఎన్నికల్లో చక్కెర ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తానని హామి ఇచ్చి దానిని అమలు చేయడం లేదని ఆయన విమర్శించా రు. రైతులు సుభీక్షింక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వాని మద్దతు ధర అడిగితే రైతుకు బేడీలు వేయించిన ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ రిలే నిరాహార దీక్షలు కొనసాగించాలని ఆయన అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భా స్కర్, చెరుకు రైతుల సంఘం నాయకులు నారాయణరెడ్డి, రాజరెడ్డి, పాప న్న, బీజేపీ నేతలు గంప శ్రీనివాస్, మారంపెల్లి శ్రీనివాస్, సుఖేందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల: రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, దేశంలో కాంగ్రెస్‌కి అడ్రస్ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ప్రజల పాలిట శాపంగా మారిందని, పాలనను గాలికి వదిలి అధికారం కోసం పిరాయింపులను ప్రోత్సహించడం అందుకు నిదర్శనం అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, వేణు, ఇందూరి తిరుమల వాసు, అరుణ, శ్రీనివాస్, ప్రసాద్, చందు, తదితర గ్రామాల అధ్యక్షుడు, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రేకొండలో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
* వరుస సంఘటనలతో కలకలం
చిగురుమామిడి, నవంబర్ 19: మండలంలోని రేకొండలో ఊర చెరు వు మత్తడి వద్ద గత ఏడాది మిలీనీయం యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కొద్దిరోజుల క్రితమే నవగ్రహ విగ్రహాల ధ్వంసం జరిగింది. ఇలా వరుస సంఘటనలతో రేకొండ వాసులు బెంబేలెత్తుతున్నారు. గతంలో మూడుసార్లు శివాలయంలో హుండీ దొంగతనం, దివంగత మాజీ ఎంపీపీ చాడ ప్రభాకర్‌రెడ్డి విగ్రహం ధ్వంసం, బ్రహ్మంగారి ఆల యం వద్ద రెండుసార్లు నవగ్రహలు ధ్వంసం, నేడు గాంధీ విగ్రహంతో పా టు దివంగత సీపీఐ నేత పరాంకుశం కేశవస్వామి స్థూపం ధ్వంసం ఇలా వరుస సంఘటనలు రేకొండ వాసుల ను కలవర పెడుతున్నాయి. గ్రామంలో అశాంతి నెలకొనే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపుల్లో మద్యం సేవించి యువ త తప్పుడు పనులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. బెల్ట్‌షాపు నిర్వాహకులు అర్ధరాత్రి సై తం మద్యం అమ్మకాలు చేస్తుండటంతో ఈవిధమైన దుస్థితి నెలకొందని, ఆబ్కారీ అధికారులు స్పందించి తక్షణమే బెల్ట్‌షాపులు మూసివేయించాలని రేకొండ వాసులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సైతం రాత్రి వేళల్లో గస్తీనీ పెంచి, ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమాన్ని చేపడితే ప్రయోజనం ఉంటుందని తద్వా రా రాత్రివేళల్లో మద్యం విక్రయాలకు చెల్లుచీటి పడటంతో పాటు, చెడు ప నులు చేయాలని ఆలోచించే వారికి కళ్లెం వేసినవారవుతారనే భావన నెలకొంది. గ్రామ రక్షక దళాన్ని ఏర్పాటు చేసి, రాత్రివేళ ల్లో గస్తీ తిరిగేట్లు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. విచారణ వేగవంతం చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.