కరీంనగర్

స్వచ్ఛమానేరుకు విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, నవంబర్ 19: స్వచ్ఛ్భారత్‌లో భాగంగా ఆదివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛమానేరు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కరీంనగర్‌కు చెందిన అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సందర్శకు లు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మానేరు డ్యాంనకు పైకెక్కే ప్రాంతం నుండి గేట్ల వరకు, డ్యాం కట్టకు ఇరువైపులా ఉన్న చెత్తా, ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించా రు. నగర మున్సిపల్ కార్పొరేషన్ వా రు అందించిన సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ స్వచ్ఛమానేరు కార్యక్రమానికి పోలీస్ శాఖ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. స్వచ్ఛమానేరు కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి మా ట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు సామాజిక కార్యక్రమా ల్లో భాగస్వాములు కావాలనే ఉద్ధేశం తో ఈ స్వచ్ఛమానేరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లా ప్రజల కు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శశాంక మాట్లాడుతూ ఆహ్లాద వాతావరణం కల్పించే ఈ సందర్శక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ ప్రాం తాల్లో ఏర్పాటు చేసిన చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నగర మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాద్యత అన్నారు. ఈ సందర్భంగా మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకోసం కేశవరెడ్డి రూ.50 వేలు, శివప్రసాద్ రూ.10 వే లు, అబ్దుల్ గఫార్ రూ.10 వేలు విరాళాలను చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు అందజేశా రు. లేక్ పోలీసుల సౌకర్యార్థం కూడలి శ్రీనివాస్ రెండు అధునాతన సైకిళ్లను అందజేశారు. అడిషనల్ డిసిపి పి. సం జీవకుమార్, ఎసిపి పి.వెంకటరమణ, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ తుల శ్రీనివాస్ రావు, లేక్ ఎస్‌ఐ వి.రవి, కార్పోరేటర్ సునీల్ రావు, శాంతి, సంక్షేమ కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఘన్ శ్యాం ఓజా, ఎన్‌సిసి కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, మానేరు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.