కరీంనగర్

అవినీతి, అభివృద్ధిపై చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 19: అవినీతి, అభివృద్ది పనులపై బహిరంగ చర్చకు సిద్దమని అధికార తెరాస పాలకులకు టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఆదివారం సాయంత్రం సిరిసిల్ల పాత బస్టాండ్‌లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత కెకె.మహేందర్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ అకునూరి బాలరాజు, ఎంపిటిసి సూర దేవరాజ్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఆడెపు చంద్రకళ, పట్టణ మహిళా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, నాయకులు దొమ్మాటి నర్సయ్య, ఎస్కె సోహెల్, రాజేందర్‌రెడ్డి, వెల్ముల స్వరూప పాల్గొన్నారు.
చరిత్రను విమర్శిస్తే పుట్టగతులు ఉండవు
మానకొండూర్, నవంబర్ 19: యేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రేస్ పార్టీని విమర్శిస్తే బీజేపి పార్టీకి గాని , నరెంద్ర మోడీకి పట్టగతులు ఉండవుని టిపిసిసి ఉపాధ్యాక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం మానకొండూర్ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా గాందీ శతజయింతి ఉత్సవాలకు టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, టిపిసిసి ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరెపల్లి మోహన్, డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల అధ్యక్షుడు యాళ్ల వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు పెండ్యాల రాంరెడ్డి, శంకరయ్య, కొండ్ర శంకర్, గడమల్ల వెంకటయ్య, గసికంటి సంపత్, సర్పంచ్ రవీందరచారి, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు ఓటమిలేదు
* రాష్టస్రాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి
మానకొండూర్, నవంబర్ 19: భూ ప్రపంచం ఉన్నంత వరకు కేసిఅర్‌కు ఓటమీ లేని నాయకుడని రాష్టస్రాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. అదివారం మండల పరిధిలోని అన్నారం గ్రామాంలో మండల రైతు సమన్యయ సమితి సమావేశం జరిగింది. దీనికి రసమయి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతులు నకీలి విత్తనాలు కోనుగోలు చేసి మోసపోవద్దుని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జీవి రామక్రిష్ణరావు, మండల రైతు సమన్వయ కన్వినర్ గోపాల్‌రెడ్డి, జడ్పిటిసి ఎడ్ల సుగుణాకర్, ఎఎంసీ చైర్మన్ మల్లగల్ల నగేష్, వైస్‌ఎంపిపి దేవ సతీష్‌రెడ్డి, ప్రధిప్‌రెడ్డి, మాడ తిరుపతి రెడ్డి, వాల ప్రదిప్‌రావు, రామస్వామి, శేఖర్, కోమల, తదితరులు పాల్గొన్నారు.