కరీంనగర్

రామస్వామి మృతికి కారకులైన వారిపై క్రిమినల్ కేసు నమోదుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, నవంబర్ 23: జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో ఇటీవల మ్యాకల రామస్వామి ఆత్మహత్య సంఘటనపై సిట్టింగ్ జడ్జీపై విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయకార్యదర్శి కుమారస్వామి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వేనంబర్ 19- ఏలో 544చదరపు గజాల భూమిని మృతుడు రామస్వామి కొనుగోలు చేసి పట్టా పొందాడని, గ్రామపంచాయతీ భవన నిర్మాణ పేరుతో సర్పంచ్ భర్త కాంతయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, అదే గ్రామానికి చెందిన ఎక్కిరాల వెంకటేష్‌లు రామస్వామిపై వేదింపులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్థలం ఎస్సారెస్పీదేనని ఖాళీ చేయాలని ఎస్సారెస్పి, రెవెన్యూ అధికారుల ద్వారా ఒత్తిడి చేయించి నోటీసుల పేరుతో కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడంతో మనస్తాపానికి చెందిన రామస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. గ్రామంలో నిర్వహించిన నిజనిర్దారణ కమిటీలో వెల్లడైందని వెల్లడించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీచే విచారణ జరిపించి రామస్వామి మృతుకి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఎండీ ముంపు గ్రామం హుస్నాపూర్‌కు చెందిన రామస్వామి గత 42 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి జీవనోపాది కొనసాగిస్తున్నాడని తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.50లక్షలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జేఏవి ప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ మెంబర్ నారా వినోద్‌రావుతో పాటు పలువురు పాల్గోన్నారు.
జాతీయ స్థాయి ఈత పోటీలకు ఎంపిక
తిమ్మాపూర్, నవంబర్ 23: పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జిఎఫ్) ఆధ్వర్లంలో ఈ నెల 26నుండి 28వ తేదీవరకు న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి ఈత పోటీలకు కరీంనగర్ ఐరిస్ వారల్డ్ స్కూల్‌కు చెందిన విద్యార్థి గుగ్గిళ్ల మీనశ్వర్ (8వ తరగతి) ఎంపికైనట్లు స్విమ్మింగ్ కోచ్ తోట శ్రీ్ధర్ తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ పాఠశాలకు చెందిన గుగ్గిళ్ల మనీశ్వర్ ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈత పోటీలు అండర్ 14విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు బి.సంతోష్‌రావు, ఇ.రాకేశ్‌ప్రసాద్‌రావు, ప్రధానాచార్యులు సంజోయ్ భట్టాచార్జీ, వ్యామ ఉపాధ్యాయులు జోగినాయుడు, అబ్దుల్ రహీం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పాల్గొన్నారు.