కరీంనగర్

బాధిత రైతులకు పరిహారం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, నవంబర్ 23: ఖరీప్ రైతులకు వరి పంటల్లో సుడిదోమ ఆశించి తీవ్రంగా నష్టపోయారని బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆది శ్రీనివాస్ జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో డిఎఓ భాగ్యలక్ష్మికి గురువారం వినతి పత్రం అందించారు. వర్షాలు అధికంగా కురువడం వల్ల మొక్కజొన్న పంట దిగుబడి రైతులు ఆశించినంత రాలేక నష్టపోయారని, క్వింటాలుకు రూ. 500 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్‌ను అందించాలని కోరారు. అలాగే జిల్లాలోని ముత్యంపేట చెరుకు ప్యాక్టరీని తెరిపించి క్వింటాల్‌కు రూ.4 వేలు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్ధాయిలో పరిశీలించి నష్టపోయిన రైతుల జాబితాను రూపోందించి ఎకరాకు రూ. 25వేలు నష్టపరిహారం అందించాలని కోరారు. సుడిదోమ వల్ల పంట దిగుబడి తగ్గి రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, క్వింటాల్‌కు రూ. 500 అదనంగా అందించాలని వ్యవసాయశాఖ ద్వారా కోరుతున్నట్లు ఆది శ్రీనివాస్ అందించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
భూ శుద్ధీ రికార్డులను పరిశీలించిన కలెక్టర్
మల్యాల, నవంబర్ 23: భూ శుద్దీ రికార్డుల కార్యక్రమంలో బాగంగా మల్యాల మండలం కొండగట్టు శ్రీనాథ్ రెసిడెన్సిలో గురువారం రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన భూ శుద్దీకరణ రికార్డులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. ఈసందర్బంగా ప్రజలకు భూ రికార్డుల వల్ల భవిష్యత్తులో సమస్యలు రాకుండా భూ రికార్డులను పరిశీలించి సర్దుబాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రికార్డులను వేగవంతంగా పరిశీలన జరిపి భూ పట్టాదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్డీఓ నరేందర్, తహశీల్దార్ శ్రీహరిరెడ్డి, డిటి ఖాధర్, అర్‌ఐ హరిష్‌కుమార్, విఅర్‌ఒ తిరుపతితో అధికారులు ఉన్నారు.

కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి
* కలెక్టర్ కృష్ణ్ భాస్కర్
సిరిసిల్ల, నవంబర్ 23: సిరిసిల్ల పట్టణ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవన సముదాయ పనులను వేగిరం చేయాలని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్ భాస్కర్ రహదారులు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషాతో కలిసి కలెక్టరేట్ సమీకృత భవన సముదాయ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.పనుల పురోగతిని ఆర్ అండ్ బి ఎస్‌ఇ విఘ్నేశ్వర్‌రెడ్డి కలెక్టర్, జెసిలకు వివరించారు. ఇప్పటి వరకు చేసిన పనులను పరిశీలించిన కలెక్టర్ పనులను సకాలంలో నాణ్యతతో పూర్తి చేసేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఇఇని ఆదేశించారు. పని జరిగే ప్రదేశంలో ఏమైనాబ్బందులు ఉంటే వెటనే తన దృష్టికి తీసుకరావాలని అన్నారు. అనంతరం కలెక్టర్, జెసిలు రగడు జంక్షనఖ వద్ద, వెంకటాపూర్ గ్రామంలో రెండవ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బిఎస్‌ఇ విఘ్నేశ్వర్‌రెడ్డి, డిఎంవో షాహబుద్దీన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ ఉన్నారు.
సముద్రలింగాపూర్‌లో తనిఖీ
గంభీరావుపేట: భూప్రక్షాలనలో భాగంగా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ్ భాస్కర్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు.
గ్రామంలో భూప్రక్షాలన ఏ విధంగా జరుగుతుందని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన భూప్రక్షాళన రికార్డులను ఆయన పరిశీలించి, సంబంధిత అధికారుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్‌ఐ కార్తీక్, వీఆర్వో శంకర్ పాల్గొన్నారు.