కరీంనగర్

ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, నవంబర్ 23: ప్రభుత్వాలు సామాన్యుడి సమస్యలు పట్టించుకోవడం లేదని, పాలకులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరుబాట గురువారం జమ్మికుంట మీదుగా హుజూరాబాద్ చేరకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి వద్ద జరిగిన సభలో చాడ మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల స్థితి దయనీయంగా ఉందని, గిట్టుబాటు ధరలు లేవని, సేద్యం ఖర్చు పెరిగి రైతులు కూలీలుగా మారి పస్తులుంటున్నారని రైతుల గురించి ఆలోచించే స్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. జిఎస్‌టి విధానాన్ని ప్రవేశపెట్టి నిరుపేదల పొట్ల కొడుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బతకలేని స్థితి ఉందని, సామాన్యులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటన్నారని, ప్రతి నిత్యం ఏదో ఒక గ్రామంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ప్రభుత్వం కేవలం కమీషన్లు వచ్చే ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, భగీరథ, రోడ్లు వంటి పనులకే ప్రాధాన్యం ఇస్తోందని, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీలు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఏ మాత్రం ప్రజల కనీస అవసరాలు పట్టించుకోవడం లేదన్నారు. కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు, పేదలు కొనలేని దుస్థితి దాపురించిందని, ఒక వైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు బంగారు తెలంగాణ అం టూ ఉపన్యాసాలు ఇస్తున్నారని చాడ మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల మల్లేష్, పష్య పద్మ, సిపిఐ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సృజన, పాండురంగాచారి, రాములు యాదవ్, పరశురాములు, గోవిందుల రవి, వేణుగోపాల్, మారుపాక అనిల్‌కుమార్, కర్రె భిక్షపతి, లంకదాసరి కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర అందించాలి
జమ్మికుంట: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాధన్ కమీటి సిఫారస్‌లను అమలు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ పోరుబాటలో భాగంగా జమ్మికుంట పట్టణంలో బుధవారం రాత్రి బస చేశారు. గురువారం ఉద యం జమ్మికుంట పట్టణంలోని ప్రభు త్వ బాలికల వసతి గృహంలో వసతుల పరిశీలించి, సౌకర్యాలు సరిగా లేక పోవడంతో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ సందర్శించారు. పత్తి రైతుల అమ్మకాలు,్ధరపై ఆరా తీసారు.
ఈ సందర్బంగా చాడ వెంకట్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి తక్కువ వచ్చి దిగాలు చెందిన రైతన్నకు, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ధరతోపాటు బోనస్ ప్రకటించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తానాలతో రైతులు మోసా పోతున్నారని, కంపనీలపై ప్రభుత్వం కఠీన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్, ఎండి యూసుఫ్, ఉస్తేల సృజ న, పాండురంగాచారి, రాములు యా దవ్, జిల్లా అధ్యక్షుడు రాంగోపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు పంజాల శ్రీనివాస్, ఓల్లాల సాంబయ్య, మండల కార్యదర్శి దర్గుల రామ్మూర్తితో పాటు తదితరులు పాల్గొన్నారు