కరీంనగర్

చట్టాలపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, నవంబర్ 23:మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. గురువారం స్థానిక ఐఎంఎ హాలులో మహిళలకు నిర్దేశింపబడిన చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళ కమిషన్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ మహిళలు అన్యాయం జరిగితే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. పురుషులతో సమానంగా మహిళలు గౌరవింపబడాలని, మహిళలకు స్ధానిక సంస్ధలలో కల్పించిన రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. కార్యాలయాల్లో పని చేసే చోటు లైంగిక వేదింపులు జరుగకుండా అంతర్గత ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయలని, స్ధానిక ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. నేటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో 5జిల్లాలలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కెసిఆర్ కిట్టు పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, వివాహం జరిగిన గ్రామ స్థాయిలోనే పంచాయితీ కార్యదర్శి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పురుషునికి సమానంగా ఆడబిడ్డకు సమాన హక్కులు కల్పించాలని అన్నారు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కల్పించిందని సమానత్వపు హక్కు, కులం, మతం, జాతి, లింగ బేద వివక్ష ఉండకూడదని, మహిళలు, పిల్లల అభివృద్ది కోసం నిబంధనలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, పౌరులందరికి తమ వృత్తిని కొనసాగించే హక్కు, వ్యక్తి స్వేచ్చగా జీవించే హక్కు, ప్రాథమిక హక్కులు ఉల్లంగించినప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించే హక్కు, స్ర్తి పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉండాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేశం, డిఅర్‌ఓ శ్యాంప్రకాశ్, డిఎం సుగంధిణి, ఎపిఓ లక్ష్మినారాయణ, హైకోర్టు న్యాయవాది విజేత, అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, ఐకేపి ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.