కరీంనగర్

ఎండ @ 43.6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 11: భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉదయం ఎనిమిదిన్నర నుంచే భానుడు భగ్గుమంటుండగా, మధ్యాహ్నం అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఓ వైపు తీవ్రమవుతున్న ఎండలు..మరోవైపు వడగాలులు వెరసి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సోమవారం జిల్లాలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఉదయం ఏడు, ఎనిమిది గంటల నుంచి ఎండ తీవ్రత ఉంటోంది. పది దాటితే చాలు రోడ్లపై జన సంచారం తగ్గిపోతోంది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్ని కర్ప్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రాత్రి ఎనిమిది గంటల దాకా వేడి తగ్గడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేక కూలీలు, వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు వడదెబ్బ మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా జిల్లాలో 35మందికిపైగా మృతి చెందారు. వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ మాసంలోనే భానుడు భగభగ మండిపోవడంతో ఇక మే నెల పరిస్థితి ఏంటోనని ప్రజలు కలవరపడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు ఎంచుకుంటున్నా అవి పూర్తి స్థాయిలో ఉపశమనం ఇవ్వడం లేదు. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు కొబ్బరిబొండాలు, శీతల పానీయాలు, జ్యూస్ తదితర చల్లటి పదార్థాలను సేవిస్తున్నారు. మొత్తానికి రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతుండగా, ఏప్రిల్, మే మాసాలు ఏలా గడుస్తాయోననే బెంగ ప్రజల్ని వెంటాడుతోంది.

సామాజిక మార్పు దిశగా పయనం

కరీంనగర్, ఏప్రిల్ 11: తెలంగాణ ప్రభుత్వం సమాజంలో అసమానతలను తొలగించి, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికి అందే విధంగా, సమాజంలో మార్పు లక్ష్యంతో పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం నగరంలోని మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటెల రాజేందర్ ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానీయుల ఉత్సవాలను మొక్కుబడిగా కాకుండా ఒక వారోత్సవాలుగా నిర్వహించామని తెలిపారు. మహానీయులు సంఘానికి చేసిన సేవలను, చరిత్రను మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సెమినార్‌లు, వ్యాసరచనలు తదితర పోటీలను ఏర్పాటు చేసి వారి ప్రాసస్త్యాన్ని, వారి గొప్ప పనులను ప్రజలకు తెలియజేయాల్సి ఉందని అన్నారు. వారి స్పూర్తిని కొనసాగించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని చెప్పారు. ప్రభుత్వం మహానీయుల ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏప్రిల్ 5 నుండి 14 వరకు బాబు జగ్జీవన్ రాం, జ్యోతిరావుపూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రూ.10 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మహానీయుల ఆశయ సాధనకు మనం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పూలే విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. సమాజంలోని మూఢ నమ్మకాలు తొలగించడానికి అందరికి విద్యయే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చెరువులో నీళ్లు వుంటే ఇంట్లో ఆస్తివున్నట్లని, చెరవులను రిజర్వాయర్లుగా అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏప్రిల్ నుండి రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు, వచ్చే సంవత్సరం 24 గంటలవిద్యుత్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. జూన్ కల్లా యుద్ద ప్రాతిపదికన మొదటి, రెండో విడత చెరువుల మరమ్మత్తులు పూర్తిచేయాలన్నారు. వర్షాలు బాగా పడితే బ్రతుకులు బాగుపడతాయని మంత్రి అన్నారు. అనంతరం రూ. 10 లక్షల రూపాయాలతో మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయమును మంత్రులు పారంభించారు. ఈకార్యక్రమంలో జడ్పిచైర్‌పర్సన్ తుల ఉమ, సాంస్కృతిక సారధి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లాకలెక్టర్ నీతూ ప్రసాద్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మానకొండూర్ ఎంపిపి మాతంగి లింగయ్య, జివి రామక్రిష్ణ రావు, జడ్పిటిసి ఎడ్లసుగుణాకర్, వైస్‌ఎంపిపి దేవ సతీష్‌రెడ్డి, సర్పంచ్ వర్షిణి, ఎంపిటిసిలు సత్యం, శ్యాంమ్, మండల అధ్యక్షుడు నూతీ శ్రీనివాస్, ఆర్డివో చంద్రశేఖర్, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.