కరీంనగర్

మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల స్పందనపై ఆరా
* మానేర్ రివర్ ఫ్రంట్‌తో కరీంనగర్‌కు పర్యాటక శోభ

కరీంనగర్, డిసెంబర్ 6: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం సాయంత్రం కరీంనగర్‌కు చేరుకున్న ఆయన మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఏలా ఉందని నేతలను ఆరా తీసారు. అభివృద్ధి ఫలాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. అలాగే పార్టీ పరిస్థితులపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాబోయే కాలంలో కరీంనగర్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని, మానేర్ రివర్ ప్రంట్ నిర్మాణంతో పర్యాటక శోభతో విలసిల్లనుందని కేసీఆర్ నేతలకు వివరించారు. ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి మాత్రమే వచ్చానని, సింగరేణిలో సమస్యలు ఉన్నాయని, వాటి కోసం ప్రత్యేకంగా త్వరలోనే రానున్నట్లు నేతలకు తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌కుమార్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిఎం పర్యటనకు సన్నద్ధం కావాలి
* జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
జగిత్యాల టౌన్, డిసెంబర్ 6: ఈనెల 8న శుక్రవారం సిఎం జిల్లా పర్యటనకు అధికారులు సన్నద్దం కావలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో సిఎం పర్యటనపై అదికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగ ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ప్రగతిపై నివేదికలు సిద్దం చేయాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై జిల్లా ప్రగతిని స్పష్టం చేసే విధంగా నివేదికలు శాఖల వారిగా తయారు చేయాలన్నారు. జిల్లాలో వివిధ శాఖల లక్ష్యాలు సాధించిన ప్రగతి విషయంపై నివేదికలు సిద్దంగా ఉంచాలన్నారు. శాఖల ద్వారా చేపట్టి కార్యక్రమాల అమలులో కావల్సిన నిధులు తదితర వివరాల ప్రతిపాధనలు సిద్దం చేయలని, సిఎం పర్యటనకు అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.రాజేశం, మెట్‌పల్లి సబ్‌కలెక్టర్ ముషారఫ్‌అలీ, ఆర్‌డీవో జి.నరెందర్, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

గ్రామాభివృద్ధే ధ్యేయం
* డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు
సైదాపూర్, డిసెంబర్ 6: గ్రామాభివృద్ధిపై ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కార్యక్రమం బుధవారం మండలంలోని వెన్నంపల్లి ఉన్నత పాఠశాలలో జరిగింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని జడ్పీటిసి బిల్ల వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఎ పడి వెంకటేశ్వర్లు మాట్లాడారు. గ్రామాభివృద్ధి కోసం ఎంపి రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వొడితెల లక్ష్మికాంతారావు దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఇంటింటా సర్వే చేసి పలు అభివృద్ధి పనులపై శిక్షణ తీసుకొని వారికి అవగాహన కల్పించారు. అలాగే వెన్నంపల్లి, దుద్దెనపల్లి గ్రామాలు వంద శాతం హరితహారం పూర్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి బిల్ల వెంకటరెడ్డి, సర్పంచ్ బిల్ల రాజిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఎపిడి రాంరెడ్డి, ఎంపిటిసి బైరి రాజు, ఎంపిడిఓ అమరేందర్ రాజు, ఎంసిఓ భిక్షపతి, ఆయా గ్రామాల జిపి కార్యదర్శులు, ఐకెపి సిబ్బంది, వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఔషధ ప్రయోగాలపై ప్రభుత్వ చర్యలేవి?
* ఔషధ ప్రయోగ బాధితున్ని పరామర్శించిన రమణ, పెద్దిరెడ్డి
హుజూరాబాద్, డిసెంబర్ 6: నిరుపేదలకు, నిరుద్యోగులకు ఎరవేసి ఔషధ ప్రయోగాలు చేసి వారి ప్రాణాలు తీస్తున్న ఔషధ కంపెనీలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఔషధ ప్రయోగ బాధితుడు దేవి ప్రసాద్ కుటుంబాన్ని బుధవారం ఎల్ రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి పరామర్శించారు. రూ. పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేసారు. అనంతరం టిటిడిపి అధ్యక్షుడు రమణ విలేకర్ల మాట్లాడుతూ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని ఫార్మా కంపెనీలు ఔషధ ప్రయోగాలు చేయడం దారుణమన్నారు. ప్రయోగాల బారిన పడిన వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఫార్మా కంపెనీలపై నియంత్రణ కరువైందని, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దేవి ప్రసాద్ పై ఔషధ ప్రయోగం జరిగిన విషయం వెలుగుచూస్తే ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. జమ్మికుంట మండలంలో నాగరాజు అనే వ్యక్తి గతంలో ఔషధ ప్రయోగంతో మరణిస్తే కనీసం ప్రభుత్వం విచారణ చేయలేదని, పట్టించుకోలేదని మండిపడ్డారు. సీ ఎం కె సి ఆర్ ప్రభుత్వం ఈ సంఘటనలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. ఫార్మా కంపెనీలు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి ప్రయోగాలకు పాల్పడుతున్నాయన్నారు. బాధితులు, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా రమణ, పెద్దిరెడ్డిల వెంట టిడిపి నాయకులు మల్లయ్య యాదవ్, గుర్రం వెంకటేశ్వర్లు, కందుల ఆదిరెడ్డి, పుల్లాచారి, వాణి, శివరామకృష్ణ, రవిందర్, శ్రావణ్, ఆగయ్య, రాజు, సంపత్‌రావు, వెంకట్, బాల్‌రెడ్డి, అంకూస్ తదితరులు ఉన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో హోం గార్డులూ కీలకమే
* హోం గార్డుల అవతరణ దినోత్సవ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ రవీందర్
సిరిసిల్ల, డిసెంబర్ 6: పోలీసు శాఖలో హోం గార్డులు అందిస్తున్న సేవలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో వీరు నిర్వహించే విధులు తక్కువేమీ కాదని జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ అన్నారు. బుధవారం 55వ హోం గార్డుల అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తంగళ్ళపల్లి మండలం తాడూరులోని ఆర్మ్‌డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈకార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ రవీందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు పరేడ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రవీందర్, జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ నరహరి, వేములవాడ డీఎస్పీ చంద్రశేఖర్‌లు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆర్‌ఎస్‌ఐ రజనీకాంత్, సుబ్రమణ్యం నాయుడు, శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్‌కుమార్, సిరిసిల్ల రూరల్ సీఐ, తంగళ్ళపల్లి ఎస్సై వెంకటకృష్ణలు హాజరు కాగా, పరేడ్ కమాండర్‌గా నాంపెల్లి, ప్లాటూన్ కమాండర్స్‌గా ఎంఏ.లియజ్, రాములు, దేవరాజు, షేక్ భాషుమియాలు పాల్గొన్నారు.

ఆత్మహత్యాయత్నాలకు కారణమైన భూ తగదా
* పోలీసుల వైఖరిపై ఎస్పీ మండిపాటు
* ఇరువురిని పిలిపించిన ఎస్పీ అనంతశర్మ
ధర్మపురి, డిసెంబర్ 6: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో ఒక సివిల్ పంచాయతిలో పోలీసుల జోక్యం ఇరువురు మహిళల ఆత్మహత్యా యత్నాలకు దోహద పడింది. వివరాలలోకి వెళితే...దోనూరు గ్రామానికి చెందిన ఆసం నారాయణ మొదటి భార్య లక్ష్మి, రెండవ భార్య శ్యామల కాగా, లక్ష్మి, నారాయణ మృతి చెందాడు. 2013లో గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పంచాయతి కాగా, ఇరువురు భార్యలకు చెరి సగం ఇల్లు, చెరి 10గుంటల భూమి చెందాలని నిర్ణయమైంది. లక్ష్మికి ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, శ్యామలకు ఇరువురు కుమార్తెలు కాగా, వివాహితులైన వారిరువురూ, దోనూరులోనే ఎఎన్‌ఎం, పోస్ట్ ఉమన్‌గా పని చేస్తున్నారు. శ్యామలకు ఇరువురు కూతుళ్ళే అయినందున ఆస్తిని విక్రయిస్తే అభ్యందరం ఉండరాదని తీర్మానించారు. లక్ష్మి కుమారుడు సత్తన్న దుబాయిలో ఉంటుండగా, ఆయన భార్య రమ్య ఇంటి స్థలంలో బాత్‌రూం నిర్మాణం చేపట్టింది. తమ స్థలంలోకి వస్తున్నదని శ్యామల అడ్డుకోగా, ఈ విషయంలో ఫిర్యాదు ఆధారంగా శ్యామల, భాగ్యమ్మ, మంగలపై గత నెల 31న కేసు నమోదైంది. తిరిగి నిర్మాణం ప్రారంభం కాగా, హెడ్డు సదరు స్థలంలో ఉండి సహకరిస్తూ, తమను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, బుధవారం ధర్మపురి తహశీల్‌దార్ కార్యాలయం ముందు శ్యామల, భాగ్యలక్ష్మి, మంగలు పురుగుల మందు డబ్బాతో బైఠాయించి, తాము ఆత్మహత్య చేసుకుంటామని, కేసు పెట్టించిన వారి, నాయకుల పేర్లను ఉటంకిస్తూ మరణ వాగ్మూలం చేత బూనగా, ఎస్‌ఐ రామకృష్ణ హుటాహుటిన చేరుకుని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చి స్టేషన్‌కు తీసుకెళ్ళారు. అనంతరం ఆసం రమ్య అదే దారిలో పురుగుల మందు డబ్బాతో తహశీల్‌దార్ కార్యాలయం వద్దకు చేరుకోగా, వారించి, స్టేషన్‌కు తీసుకెళ్ళారు. సిఐ శ్రీనివాస్ కార్యాలయంలో విషయంపై విచారించగా, ఎస్పీ అనంత శర్మ, పోలీసుల వ్యవహార శైలిపై మండిపడి, అందరినీ తమ కార్యాలయానికి వెంటనే పిలిపించుకున్నారు. అతిగా ప్రవర్తించిన హెడ్‌ను ఏఆర్‌కు అటాచ్ చేయ నిర్ణయించారు.

అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలి
* జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
జగిత్యాల, డిసెంబర్ 6: అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిర్మూలన వారోత్సవాల సందర్బంగా అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అవినీతిని శాశ్వతంగా నిర్మూలిస్తేనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించే భాద్యత అందరిపైన ఉందన్నారు. యువత కూడ ఇప్పడి నుండే అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. రాజేశం, మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముఫారఫ్ అలీ, డిఆర్‌ఓ శ్యాంప్రకాశ్, ఆర్‌డిఓ నరేందర్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిరుద్యోగ యువకులపై ఔషధ ప్రయోగాలు
* ఔషధ కంపనీలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
* టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి
జమ్మికుంట, డిసెంబర్ 6: నిరుద్యోగ, ఉపాదిలేని యువకులు ఔషధ కంపనీలు ప్రయోగాలకు బలైన వంగర నాగరాజుమృతి చెందగా, మతి స్థిమితం కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన కార్పోరేటు వైద్యం అందించాల్సిన ప్రభుత్వం, ఫార్మా కంపనీలకు కొమ్ముకాస్తు, కేసులను తప్పించేందుకు పూనుకుంటుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ,జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి అరోపించారు. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామానికి చెందిన వంగర నాగరాజు ఔషధ ప్రయోగంతో మృతి చేందిన కుటుంబాన్ని, కొత్తపల్లి గ్రామానికి చెందిన సిలువేరి అశోక్‌కుమార్ ఔషధ ప్రయోగంతో మతి స్థిమితం కోల్పోయి చికిత్స పోందుతుండగా భాధిత కుటుంబాలను బుధవారం పరమార్శించారు. ఈ సందర్బంగా ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఫార్మా కంపనీల నియమ నిబంధనలు తెలియని, అమయకులైన యువకులపై ప్రయోగాలు చేసున్నాయన్నారు. దినికి ప్రభుత్వం బాధ్యత వహించి,సరైన వైద్యం అందించవలసిన పోయి,ప్రభుత్వం మిన్నాకుండి పోవడాన్ని చుస్తే అర్ధవౌతుందన్నారు.నాగరాజు మృతి చెంది నెలలు గడుస్తున్న,పోస్టుమార్టం రిపోర్టును బయటకు రానీయడం లేదన్నారు. దళారులు ఔషధ ప్రయోగాల కోసం బెంగుళూర్ ఫార్మా కంపనీలకు తీసుక పోయి వారి జీవితాలతో చెలగాటం అడుతున్న, తల్లి తండ్రులకు అన్నం పెట్టే దిక్కులేని దుస్థితి వచ్చె విధంగా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పోలీసులు ఔషధ కంపనీల కేసులను,్భధితులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నయని అరోపించారు.దళారులపై చర్యలు ఎవని ప్రశ్నించారు. నిరుద్యోగలు యువకులకు ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం తెచ్చుకుంటే,చివరికి ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. డిగ్రీలు చదువుకోని ఉపాధిలేక యువకులు చనిపోతున్నారన్నారు.అరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు ట్టుబాటు ధర లేకుండా చేసిన ఘనత టిఅర్ ఎస్ ప్రభుత్వనిదన్నారు. హుజురాబాద్ నియోజక వర్గంలో ఈటల రాజేందర్‌ను ఐదు సార్లు గెలిపిస్తే, ఈ ప్రాంతంలో ఒక్కరికైన ఉద్యోగం ఇప్పించవా అన్నారు.బాదితులను అభయ అస్తం ఇవ్వకుండ, పరమార్శించకుండా గాలికి వదిలేశారన్నారు. మేము రాజకీయాలు చేయడానిక రాలేదని, తక్షణమే ఔషధ ప్రయోగాలకు బలి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఔషధ ప్రయోగం జరిగి మృతి చెందిన వంగర నాగరాజు కుటుంబానికి 25వేల రూపాయాల అర్ధిక సాయం, మతి స్ధిమితం కోల్పోయిన సిలువేరి అశోక్‌కుమార్‌కు 10వేల రూపాయల అర్థిక సాయం అదించారు. భాధితుల పక్షణ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. ఈకార్యక్రమంలో స్టేట్ జనరల్ సెకరేటరీ మల్లయ్య యాదవ్,గుర్రం వెంకటేశ్వర్లు,బిసి నాయకులుకందుగుల అదిరెడ్డి,పుల్లాచారి,శివరామకృష్ణ,చందాగాంధి,రవిందర్,శ్రావణ్,జంగిల సుధకర్‌తోపాటు తదితరులు పాల్గోన్నారు.

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సిపి
రామడుగు, డిసెంబర్ 6: ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ శివారులో 8వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న పంప్ హౌజ్ పనులను శుక్రవారం పరిశీలించనున్న నేపథ్యంలో ఇక్కడ అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సిపి కమలాసన్ రెడ్డి పంప్ హౌజ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ పనులను పరిశీలించారు. హెలీప్యాడ్ నుండి సిఎం పంప్ హౌజ్‌కు చేరుకునే అనువైన మార్గాలు పరిశీలించారు. సిఎం పర్యటించనున్న నేపథ్యంలో గట్టి బందోబస్తుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్‌డిఓ రాజాగౌడ్, తహశీల్దార్ ముజీబ్ అహ్మద్, ఎస్‌ఐ నరేష్ రెడ్డి అధికారుల వెంట ఉన్నారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
* ప్రభుత్వ చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, డిసెంబర్ 6: నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర ప్రభుత్వ చిప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్‌సి సంక్షేమ సంఘం ఆల్ ఇండియ అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో బుధవారం బాబా సాహెబ్ 61వ వర్థంతి కార్యక్రమాన్ని స్థానిక తహశీల్దార్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విఫ్ కొప్పుల ఈశ్వర్‌తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జెసి రాజేశం పలువురు నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా విఫ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అన్నివేళల అండదండలు ఉంటాయన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను దళిత, బలహీన వర్గాలకు చేరేందుకు నిరంతంర చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల ఆశాజ్యోతి బాబా సాహేబ్ మహానీయుడని, వారి రాజ్యాంగ స్పూర్తి ప్రభుత్వం పని చేయాలన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మట్లాడుతూ ప్రపంచ మేధావి, పూజ్యుడు అని వారి దయ వల్లే నాలాంటి నాయకులు అయ్యారన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ చౌరస్తా సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బాబా సాహేబ్ అంబేద్కర్ రచించించిన రాజ్యాంగా స్పూర్తితోనే చిన్న రాష్ట్రాలు ఏర్పడినాయన్నారు. అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి ముద్దం ప్రకాష్ మాట్లాడుతూ పెరగుతున్న జనాభకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 25 శాతంకు పెంచాలన్నారు. నక్క విజయ్‌కుమార్, లక్ష్మినారాయణ, దళిత సంఘాల నాయకులు బొల్లం విజయకుమార్, వెంకటరమణ, దుర్గయ్య, కమలాకర్, గంగాధర్, రాజుకుమార్, అంజనేయులు, వసంతరావు, రాజయ్య, శ్రీనివాస్, నారాయణ, రాజేందర్, రాజయ్య, శంకర్, కిషోర్, ధర రమేష్, రాజేష్, దుమాల శంకర్, రాజన్న, రాజునాయక్, రాజు, పృధ్వీదర్, రాజయ్యలతో పలు రాజకీయ పార్టీల నాయకులు ఓరుగంటి రమణరావు, సాగర్‌రావు, సీపెల్లి రవిందర్, సారంగాపాణి, కట్ట శివకుమార్, బోగ వెంకటేశ్వర్లు, దేవేందర్‌నాయక్, వొల్లెం మల్లేశం, బాదినేని రాజేందర్, మన్సూర్, ముసిపట్ల లక్ష్మినారాయణ, కుర్మచలం ఉమమహేష్ ఉన్నారు.