కరీంనగర్

ప్రజా విజ్ఞప్తులన్నింటినీ వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 11: ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను, ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా స్వీకరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అదే సమస్యపై మళ్లీ ఫోన్ రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నుంచి ఒకరు ఫోన్ చేసి మహాత్మగాంధి ఫూలె గర్ల్స్ హాస్టల్‌లో ప్రిన్సిపాల్ విద్యార్థులకు సరైన వసతులు ఏర్పాటు చేయడం లేదని, పౌష్టికాహారం సరిగా అందించడం లేదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం లేదని జెసీకి ఫిర్యాదు చేయగా, దీనిపై స్పందించిన జెసి సంక్షేమాధికారి వెళ్లి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మానకొండూర్ మండలంలో గాడిదలకుంట, ఖాదర్‌గూడెం చెరువును అపరిచిత వ్యక్తులు పూడ్చివేస్తున్నారని, దాని పరిసరాల్లో ఉన్న గుట్టలను తవ్వేస్తున్నారని, వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరగా, జెసి ఆర్డీఓను, ఇరిగేషన్ అధికారిని వెళ్లి ఎంక్వయిరీ చేయాల్సిందిగా ఆదేశించారు. ముకరంపుర నుండి జగన్ అనే వ్యక్తి ఫోన్ చేసి మాకు విద్యుత్ ఆటంకం కలుగుతుందని చెప్పగా, వెంటనే ట్రాన్స్‌కో అధికారులను వెళ్లి సరిచేయాలని తెలిపారు. వీటితోపాటు పలువురు వారి వారి సమస్యలపై జెసీ దృష్టికి తీసుకురాగా, ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి జెసీ విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషా మస్రత్ ఖానం, ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా పరిషత్ సీఇఓ పద్మజారాణీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటమాధవ రావు, డీసీఓ ఇంద్రసేనారెడ్డి, జిల్లా ట్రెజరరీ అధికారి శ్రీనివాస్, సీపీఓ సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీ్ధర్, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్‌రావు, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజేశం తదితరులు పాల్గొన్నారు.