కరీంనగర్

తెలుగు వెలుగుల్లో తెలంగాణ నిండిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల టౌన్, డిసెంబర్ 12: తెలుగు భాషా గొప్పదనాన్ని గుర్తించి తెలుగు బాషా కమ్మదనాన్ని కాపాడుదామని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్ర శాఖ గ్రంథాలయం అధ్వర్యంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక ఉత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. దేశ భాషలందు తెలుగు లెస్సా అనే నానుడి నాటి నుండి నేటి వరకు అదే గొప్పదనం తెలుగుభాషాకు ఉందన్నారు. తెలుగు వెలుగుల్లో తెలంగాణ నిండి పోవాలని అకాక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశం, జిల్లా గ్రంధాలయ సంస్థ అద్యక్షుడు కటారి చంద్రశేఖర్‌రావుకు భవన నిర్మాణానికి సంబంధించిన 20గుంటల మంజూరు పత్రాన్ని అందజేసి మాట్లాడుతూ తెలుగు భాషకు సంబంధించి పూర్తి విజానాన్ని విద్యార్థులు నేర్చుకోవాలని మాతృబాషలోనే చక్కటి విజానాన్ని నేర్చుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయాన్ని పూర్తి వసతులతోనిర్మించటానికి కృషి చేస్తానన్నారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు వేయి మంది కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులతో ఉపాద్యాయులతో బతుకమ్మలు, బోనాలతో, తెలంగాణ తల్లి, తెలంగాణ వీరులు, తెలుగుకవుల వేషధారణలతో పుర వీదుల్లో పాత బస్టాండ్ , గంజ్, టవర్ సర్కిల్ తహశీల్ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మ పాటలతో మహిళలు విద్యార్థులు బతుకమ్మ ఆడి నృత్యాలు చేశారు. కార్యక్రమాల్లో పాలకవర్గ సభ్యులు కాశెట్టి సత్తయ్య, చెట్‌పల్లి సుధాకర్, గుగ్గిళ్ల సురేష్‌గౌడ్, ఎంవి నర్సింహరెడ్డి, ఎంఇఒలు నారయణ, గాయత్రి, జమునదేవి, నిర్వహణ బృందం బోనగిరి దేవయ్య, బోయినపల్లి ఆనందరావు, వివిధ ఉపాద్యాయ సంఘాల నాయకులు రాజశేఖర్, బైరం హరికిరణ్, సురేష్, పడాల విశ్వప్రసాద్, ఎడమల జితెందర్ తదితరులు పాల్గొన్నారు.