కరీంనగర్

పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, డిసెంబర్ 11: పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని తెలిపారు. కమీషనరేట్‌లోని హుజూరాబాద్, కరీంనగర్, కరీంనగర్ రూరల్ డివిజన్‌ల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తుల్లో ఉన్న కేసుల పూర్వాపరాలను సోమవారం కమీషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల నేరాల్లో నిందితులు శిక్షింపబడేలా చర్యలు తీసుకోవాలని, నిందితులు తెలియకుండా ఉన్న కేసులను చేదించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. నాన్ బెయిలబుల్ వారెంట్లలను వేగవంతంగా అమలు చేయాలని తెలిపారు. త్వరితగతిన కేసులను చేదించే పోలీసులకు శాఖాపరంగా రివార్డులు, అవార్డులను అందజేస్తామని, దర్యాప్తుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపిలు వి.సంజీవ్ కుమార్, ఎస్.శ్రీనివాస్, ఎసిపిలు పి.వెంకటరమణ, టి.ఉషారాణి, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సీపీఐ నిర్మాణ పటిష్టతకు అందరు సిద్ధం కావాలి
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 11: సీపీఐ నిర్మాణ పటిష్టతకు గ్రామస్థాయి నుండి కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎన్ని నెరవేర్చారో గ్రామస్థాయిలోకి వెళ్లి వివరాలు సేకరించి, నెరవేర్చని హామీల కోసం ఉద్యమాలు చేసేందుకు మనమందరం సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచించారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్, బిజెపి ప్రభుత్వాలు నల్లధనాన్ని వెలికితీస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదనీ, పౌర హక్కులను కాలరాస్తుందని మతోన్మాద శక్తులు, దళితులు, మైనారిటీలపై మేధావులను హతమారుస్తుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి వారి సంక్షేమాన్ని మరిచారని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇల్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య హామీలను విస్మరించి మాటలతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిపై దాడులు చేపిస్తున్నాడని, రాబోవు రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే భారీ ఆందోళనలు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పొనగంటి కేదారీ, కూన శోభారాణి, గూడెం లక్ష్మి, కాలువ నర్సయ్య, స్వామి, రాజయ్య, రాజిరెడ్డి, శ్రీనివాస్, మహేందర్, సమ్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి ఎసీపీగా హబీబ్ ఖాన్
పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 11: పెద్దపల్లి అసిస్టెంట్ పోలీస్ కమీషనర్‌గా హబీబ్ ఖాన్‌ను సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎసీపీగా వ్యవహరించిన సింధుశర్మ బదిలీపై వెళ్లగా, ఆమె స్థానంలో హబీబ్ ఖాన్‌ను నియమితులయ్యారు. హబీబ్ ఖాన్ గతంలో పెద్దపల్లి సిఐగా, గోదావరిఖని డీఎస్పీగా పనిచేశారు. గతంలో పనిచేసిన సందర్భంలో ఇక్కడి ప్రజలతో సత్సంబంధాల కొనసాగించారు. ఎసీపీగా మరోమారు ఈ ప్రాంతంలో శాంతిభద్రత పరిరక్షణలో సేవలందించేందుకు ఎసీపీగా రావడంతో ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో చేరిన డాక్టర్ అనీల్‌రెడ్డి
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 11: ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన డాక్టర్ అనీల్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలోకి చేరిన అనీల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రజల కోసం ముందు చూపుతో నూతన పథకాలను ప్రవేశపెడుతూ దేశాభివృద్దికి, ప్రజాభివృద్ధికి కృషి చేస్తున్నాడని అందులో భాగంగా జీఎస్టీ ఆర్థికాభివృద్ధి, నోట్ల రద్దుతో అవినీతిని అరికడుతున్నారని, రాబోయే రోజుల్లో దేశాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు.