కరీంనగర్

అభద్రతా భావంతోనే ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, డిసెంబర్ 12: అభద్రతా భావంతోనే టిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి గందె మాధవి అన్నారు. మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించనవని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క నూతన ప్రాజెక్టును చేపట్టలేదని అన్నారు. హైదరాబాద్‌కు తాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసిందని, దానిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం లాంచనంగా ప్రారంభించి తామె హైదరాబాద్‌కు నీటిని తీసుకొచ్చామని చెప్పుకోవడం తగదన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, తన్నీర్ హరీష్ రావు కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఏ ఒక్క రోజు కూడా ప్రాజెక్టులపై తప్పొప్పులను చూపలేదని, అటువంటిది ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి చేయలేదనడం దిగజారిన రాజకీయానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలైనా శాతవాహన యూనివర్శిటీకి ఇప్పటికీ విసిని నియమించకపోవడం విద్యపట్ల వారికున్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ, బిసి సెల్ జిల్లా అధ్యక్షులు దిండిగాల మధు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రవి, ఇరుకుల్ల సర్పంచ్ మారుతి రావు, నేతలు నిఖిల్ చక్రవర్తి, శ్రీనివాస్, దేవేందర్, మోహన్, సురేందర్, మీస రమ, గందె మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.
సీఎం హామీలన్నీ నీటిమూటలే
పెగడపల్లి, డిసెంబర్ 12: సీఎం కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని నీటిమూటలేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. మంగళవారం పెగడపల్లి మండలంలోని బతుకపల్లిలో దీన్‌దయాల్ శత జయంతి పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం పలువురు యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ధర్మపురి నియోజవర్గ ఇన్‌చార్జి కన్నం అంజయ్య, నేతలు గంగా మల్లేశం, మర్రిపెల్లి సత్యం, కరుణాకర్, కొమురవెళ్లి, నరేందర్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప పడిపూజ
సుల్తానాబాద్, డిసెంబర్ 12: అయ్యప్ప స్వామి పడిపూజ కన్నుల పండువగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వాముల శరణఘోషతో పూ సాల గ్రామ పరిధిలోని శాస్ర్తినగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అభయాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ, పడిపూజ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్షలు చేపట్టినవారు వేడుకల్లో పాల్గొన్నారు. అయ్యప్ప నిత్యాన్నదాన నిర్వాహకులు, మాజీ మార్కె ట్ కమిటి చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ సర్పంచ్ సాయిరి పద్మ, గురుస్వాములు మిట్టపల్లి మురళి, రెడ్డి శేఖర్, సతీష్, నాగుల కుమార స్వామి, బుచ్చిరెడ్డి, పారుపెల్లి గుణపతి, వెగోళం అబ్బయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.