కరీంనగర్

తెలంగాణ వచ్చినా ప్రజల్లో ఇంకా అసంతృప్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల్లో సంతృప్తి లేదని,సామాజిక తెలంగాణ రాష్ట్రంగా మారినప్పుడే ప్రయోజనం ఉంటుందని సిఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులోని మోతె మాల వార్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే వ్యక్తుల్లో వికాసం అభివృద్ధి చెందుతుందన్న భావన బిఆర్ అంబేడ్కర్‌లో ఉండేదన్నారు. సమాజ అభివృద్ధి కోసం రిజర్వేషన్లు అవసరం అని గుర్తించిన అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించారని, ప్రభుత్వం నుంచి ప్రైవేట్ రంగ సంస్థలు అనేక ప్రయోజనాలు పొందడం జరుగుతుందని అయినా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సౌకర్యం లేకపోవడం తో ప్రయోజనం చేకూరడం లేదన్నారు. కేజిటూ పిజి వరకు ఆంగ్లంలో ఉచిత విద్యను అందిస్తేనే రాష్ట్రానికి,దేశానికి ప్రయోజనం ఉంటుందన్నారు. హెచ్‌సియులో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కారకుల్లో విసి అప్పారావు ఒక బాధ్యుడిగా వెలుగులోకి వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని సిఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నియోజక వర్గ ఇంచార్జి సంజయ్‌కుమార్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శంకర్, ఎంఇఓ మద్దెల నారాయణ కౌన్సిలర్లు కాయితి శంకర్, దమ్మ హన్మాండ్లు, శివ పాల్గొన్నారు.