కరీంనగర్

నీటి విడుదలపై ప్రకటన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, డిసెంబర్ 12: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎప్పటిలోగా విడుదల చేస్తారో స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలు స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. మంగళవారం గంగాధరలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు 90 శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడిచినా అట్టి పనులను పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గంలోని మెట్టప్రాంతాలకు నీరందించడంలో పాలకులు పూర్తిగా విఫలమైనారని ఆయన విమర్శించారు. అలాగే ఎల్లంపల్లి నీటిని గజ్వేల్, సిద్ధిపేటలకు తరలించేందుకే నందిమేడారంలో పనుల పేరిట నీటి విడుదలను జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొదటి మడిని ఎండబెట్టి చివరి మడికి నీరు తరలిస్తే నియోజకవర్గంలోని రైతాంగంచే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ దంపతులు రేణికుంట టోల్‌గేట్ వద్ద కాంట్రాక్ట్ సిబ్బందిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల అరాచకాలు, దాడులు పెరిగిపోయాయని, టోల్‌గేట్ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి గన్‌మెన్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు రామిడి రాజిరెడ్డి, మాజీ జడ్పీటిసి గునుకొండ బాబు, స్థానిక సర్పంచ్ వైద రామానుజం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తుమికి పవన్ కుమార్, ఎంపిటిసి నందయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్వామి, చిప్ప చక్రపాణి, దూలం వీరేశం, బండారి నర్సయ్య, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.