కరీంనగర్

రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి, డిసెంబర్ 12: సీఎం కేసీఆర్ రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతు న్నారని బీజేపీ రాష్ట్ర నేత ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన మెట్‌పల్లికి వచ్చి చెరుకు రైతులు చేస్తున్నా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బీజేపీ శ్రేణులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ కన్నీరు పెడితే అరిష్టమని, అన్నదాతను కష్టాలు పెడితే మం చిది కాదన్నారు. ముత్యంపేట, నిజాం దక్క న చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని చెరుకు రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోక నిర్లక్ష్యం వహించడం రైతుల పట్ల ఎపాటీ ప్రేమ ఉందో తెలుస్తుందని, రాబోయే 2018 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, రైతుల కష్టాలు తీరుతాయని అరవింద్ అన్నారు. నిజాం దక్కన్ చక్కెర ఫ్యాక్టరీని రానున్న జనవరి 14వ తేదీలోగా రాష్ట్ర ప్రభు త్వం తెరిపించాలని, లేనిపక్షంలో తాను రైతుల కోసం ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ నుంచి పాదయాత్ర చేపడతానని, ఫ్యాక్టరీని ఉద్యమం ద్వారానే తెరిపించుకుందమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, చెరుకు రైతుల పునరుద్ధరణ కమిటీ కన్వీనర్ గురిజల రాజరెడ్డి, చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, బీజేపీ నాయకులు గంప శ్రీనివాస్, ఇందూరి సత్యం, సదాశివ్, సత్యనారాయణ, మల్లయ్య యాదవ్, చెరుకు రైతుల నాయకులు పాపన్న, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్, భూంరెడ్డి , తదితరులు ఉన్నారు.
ఘనంగా ఉర్సు ఉత్సవాలు
* దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 12: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముస్లీం సోదరులు స్థానిక జామే మసీద్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. గ్రామ శివారులోని హజ్రత్ ఇమాం అలీ హంజా దర్గా వరకు ర్యాలీ కొనసాగింది. సందాలు(గంధం)ను సమర్పించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. మత గురువులు ప్రబోధనలు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, హైదారాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు సాదుల్లా, గ్రామ శాఖ అధ్యక్షుడు హైమద్, ఉపాధ్యక్షుడు జాఫర్, సభ్యులు గౌస్, మజీద్, రఫీక్, మహబూబ్, గౌసొద్దిన్, లాల్‌మహ్మద్, ఆరీఫ్, తాజ్, ఇర్ఫాన్, అస్లాం, సాహేబ్, చాంద్‌పాషా, సాహేద్, పాషామియా, ఎదుల్, షాదుల్‌కురేషి, మహమూద్, ఇర్షాద్, శరీఫ్, జావీద్, మోహిజ్, రిజ్వాన్, ఇత్యాత్‌పాషా నేతృత్వంలోని నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.