కరీంనగర్

ట్రిపుల్ తలాక్‌పై టిఆర్‌ఎస్ నిర్ణయం ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 14: ట్రిపుల్ తలాక్ అంశంపై అధికార టిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ ముస్లిం మహిళల మనోభావాలు గుర్తించి, వారి ఆత్మాభిమానాన్ని కాపాడేక్రమంలో ట్రిపుల్ తలాక్‌పై పార్లమెంటులో చట్టం తేవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుననుసరించి, కేంద్ర ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. దీనిని సాకుగా చూపుతూ, రాష్ట్రంలో మైనార్టీల ఓట్ల కోసం తెరాస ఎంఐఎంతో అంటకాగుతుందని విమర్శించారు. ముస్లీం మహిళలు బిజెపికి అనుకూలంగా మారుతుండగా, సహించలేక మతతత్వాన్ని పెంచిపోషించే వారితో కలిసి అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలు లెక్కచేయకుండా, ఎంఐఎం చేతిలో అధికార పార్టీ కీలు బొమ్మగా మారటం సిగ్గుచేటన్నారు. రజాకార్లతో ప్రారంభమైన పార్టీకి మద్దతివ్వటం వెనుక ఆంతర్యమేంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తీవ్రవాదులను పెంచిపోషించే పార్టీకి నైతిక మద్ధతునివ్వటం దేశద్రోహమేనని, దేశాన్ని కించపరిచే వారితో కలిసి పనిచేస్తున్న ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అత్యధిక శాతం హిందూ దేవాలయాల్లో మజీదులుండగా, మసీదుల్లో మాత్రం దేవాలయాలు లేకపోవటమే ముస్లింల సోదరత్వమా అని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యంగా హిందువులు భావిస్తుంటే, మజీదు నిర్మించాలనటం దుర్మార్గమన్నారు. ప్రజల మనోభావాలకనుగుణంగా దేశంలో బిజెపి పాలన సాగిస్తోందని, దేశ రాజ్యాంగాన్ని న్యాయస్థానాన్ని గౌరవించిన వారే భారతీయులుగా పరిగణించబడుతారన్నారు. లాబోర్డుల పేర సొంత నిర్ణయాలు తీసుకునే వారికి దేశంలో నివసించే హక్కులేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగటం ఎంఐఎం నేత అసదుద్దిన్ ఓవైసీ దిగజారుడుతనాన్ని తేటతెల్లం చేస్తుందని, రాబోయే రోజుల్లో నైజాం రజాకార్లను తయారుచేయనున్న టిఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన విధంగా సత్కరిస్తారన్నారు. సమావేశంలోబిజెపి నగరశాఖ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు బి.ప్రవీన్‌రావు, నాయకులు దుబాల శ్రీను, బండ రమణారెడ్డి, పొన్నం మొండయ్యగౌడ్, పొన్నం రాము, కిరణ్, గణేశ్, ముప్పిడి సునీల్, పాదం శివరాజ్, దుడ్డెల శ్రీ్ధర్, బండ అనితతో పాటు పలువురు పాల్గొన్నారు.