కరీంనగర్

విద్యార్థుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, డిసెంబర్ 14: ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాలలోని వివిధ రకాల రెసిడెన్షీయల్ పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని కస్తూరిభా, జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తున్న ఉచిత బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు సంపూర్ణ భోజనాన్ని అందిస్తుందన్నారు. పదవతరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యధిక మార్కు లు సాధించి రాష్ట్రంలో మెరిట్‌గా నిలువాలన్నారు. చందుర్తి కస్తూర్బా పాఠశాలకు ప్రహరీగోడ నిర్మాణంతో పాటు మంచినీటి సౌకర్యానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎంపిపి రంగు వెంకటేశం గౌడ్, మాజీ ఎంపిపి చిలుక పెంటయ్య, చందుర్తి సర్పంచ్ గొట్టె ప్రభాకర్, నాయకులు పులి సత్యం, సలీం తదితరులు పాల్గొన్నారు.
సెస్ డైరెక్టర్‌కు పరామర్శ
చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబాన్ని గురువారం జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పరామర్శించారు. అలాగే సెస్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు సైతం పరామర్శించారు. ఈమె వెంట జడ్పీటిసి అంబటి గంగాధర్, ఎంపిపి వెంకటేశం, మాజీ ఎంపిపి చిలుక పెంటయ్య, నాయకులు మాడిశెట్టి ఆనందం, గట్ల మీనయ్య తదితరులు పాల్గొన్నారు.