కరీంనగర్

తెలుగు భాషను ప్రపంచానికి చాటిచెప్పేందుకే మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 14: తెలుగు భాషలోని కమ్మదనాన్ని, మారుధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే సీఎం కెసిఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. గురువారం స్థానిక శాతవాహన యూనివర్శిటిలో తెలుగు మహాసభలను పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు అధ్యాపకులు, కళాకారుల సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ సభల నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో అన్ని దేశాలలోకెల్లా ఉన్నత స్థానాన్ని సంపాదించి పెట్టనుందని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు భాషాభిమానులు, రచయితలు, కళాకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు అధ్యాపకులు, కళాకారులను ఘనంగా సత్కరించారు. టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో-ఆర్డినేటర్ అనీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపిపి వాసాల రమేష్, రేకుర్తి సర్పంచ్ నందెల్లి పద్మా-ప్రకాష్, నాయకులు ఎడ్ల అశోక్, తిరుపతి రావులతో పాటు పలువురు పాల్గొన్నారు.

అన్ని మతాలకు సమాన గౌరవం
* ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 14: రాష్ట్రంలో సీఎం కెసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ గౌరవిస్తున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. గురువారం నగరంలోని మూడవ డివిజన్‌లో క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అందించే ఉచిత దుస్తుల కిట్లను క్రైస్తవులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశంతో భార్యాభర్తతో పాటు యువతులకు కూడా దుస్థులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హిందువులకు బతుమ్మకు, ముస్లీంలకు రంజాన్‌కు బట్టలు అందించినట్లే క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కూడా దుస్థులు అందిస్తుందని తెలిపారు. 18 వరకు దుస్థుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, 20న క్రైస్తవులకు క్రిస్మస్ ఫెస్ట్ పేరిట విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వైద్యుల శ్రీదేవీ-అంజన్ కుమార్, బోనాల శ్రీకాంత్, తహశీల్దార్ శ్రీనివాస్, మైనారిటీ సంక్షేమాధికారి సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.