కరీంనగర్

నవ తెలంగాణ నిర్మాణం సిఎం కెసిఆర్‌తోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, డిసెంబర్ 15: నవ తెలంగాణ నిర్మాణం సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమని టిఎస్ ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ అన్నారు. 70 మంది సింగరేణి కార్మికులు శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గౌతమీ నగర్‌లోని ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ ఆయన స్వగృహంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల సీమాంధ్రుల పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని తెలిపారు. ఆత్మ బలిదానాలతో పోరాడిన సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంను టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సిఎం కెసిఆర్ తనదైన శైలిలో అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కేవలం మూడేళ్ల పాలనలోనే ఎంతో అభివృద్ధి చేసి చూపారని చెప్పారు. దళిత, బడుగు, బలహీన, పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్ కంకనం కట్టుకొని చేపడుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నాయని చెప్పారు. వీటన్నింటిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు అన్నింట అడ్డుపడుతున్నాయని అన్నారు. ఎవరెన్ని చేసిన సిఎం కెసిఆర్ కల గన్న బంగారు తెలంగాణగా రాష్ట్రంను తీర్చిదిద్ధుతారని దీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ బాటలో నడుస్తూ రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో సింగరేణి కార్మికులు ఎండి.మోసిన్, ఎం.రాజశేఖర్, డి.సంజీవ్, జి.నరేష్, శ్రీకాంత్, అరవింద్, రాంచందర్, కుమార్‌తోపాటు మరో 60 మంది కార్మికులున్నారు.