కరీంనగర్

అవకతవకలు జరిగినందనే ఎక్సైజ్ ఎస్సైల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి, డిసెంబర్ 15: గుడుంబా విక్రేతల పునరావాస పథకంలో అవకతవకలు జరిగినందునే మెట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లోని ఇద్దరు ఎస్సైలు రాములు, చిరంజీవిలను సస్పెండ్ చేయడం జరిగిందని, సిఐ చంద్రశేఖర్ మరో చోటుకి బదిలీ చేసామని జగిత్యాల జిల్లా ఎక్సైజ్ సూపర్‌రెండెంట్ శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం మెట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌కి వచ్చిన సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం గుడుంబాను రాష్ట్ర వ్యాప్తంగా అరికట్టాలనే ఉద్దేశంతో గుడుంబా విక్రేతలకు ప్రత్యాన్మాయ ఉపాధి చూపించాలని, పునరావాస పథకం ప్రవేశ పెట్టిందన్నారు. జగిత్యాల జిల్లాలో 159 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం వస్తు రూపేన అందచేసినట్లు పేర్కొన్నారు. ఇందులో మెట్‌పల్లి స్టేషన్ పరిధిలో 46 మంది లబ్దిదారులు ఉన్నారని అన్నారు. వీటిలో అవకతవకలు జరిగినట్లు ఎక్సైజ్ కమీషన్ ప్రాథమిక విచారణలో తేలడంతో ఇద్దరు ఎస్సైలు, ఒక సిఐపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో సిబ్బంది ఎవరి ప్రమేయం ఉన్న వదిలిపెట్టేది లేదని, శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు.