కరీంనగర్

తెలుగు మహాసభలకు తరలిన భాషాభిమానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలకు శుక్రవారం జిల్లా నుంచి అధిక సంఖ్యలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు, ఉపాధ్యాయులు తరలివెళ్లారు. జిల్లా నుంచి మహాసభలకు వెళ్లేందుకు జిల్లా యంత్రాంగం 30 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, ఆ బస్సుల్లో తరలివెళ్లారు. కలెక్టరేట్ ఎదుట ఆ బస్సులను జెసీ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈ నెల 15నుంచి 19వరకు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నదని అన్నారు. తెలుగు మహాసభలను శుక్రవారం సాయంత్రం ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 19న తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకలలో పాల్గొనుటకు జిల్లాలోని తెలుగు భాషాభిమానులను పంపిస్తున్నామని తెలిపారు. జిల్లా నుంచి వివిధ శాఖల ద్వారా 30 బస్సుల్లో 1500మందికిపైగా తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, భాషాభిమానులు, కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలను పంపిస్తున్నట్లు వివరించారు. వెళ్లేటప్పుడు సిద్దిపేటలో, తిరుగు ప్రయాణంలో షామీర్‌పేట వద్ద భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సమాచార శాఖ ఉప సంచాలకులు ఎన్.వెంకటేశ్వర్‌రావు, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు జయశంకర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.