కరీంనగర్

విధి విధానాలు మెరుగు పర్చుకుంటూ విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, డిసెంబర్ 15: విధి విధానాలను మెరుగుపరుచుకుంటూ పోలీసులు తమ విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ సూచించారు. శుక్రవారం ఎన్టీపీసీలోని సింధూర ఇంజనీరింగ్ కళాశాలలో రామగుండం కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఎస్‌ఐలకు రిఫ్రెషర్స్ కోర్సు ఫర్ పోలీస్ ఆఫీసర్స్ శిక్షణా తరగతులు చేపట్టారు. పోలీస్ కమీషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఆధునిక, సాంకేతిక టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, జనమైత్రి పోలీసింగ్ విధానంతో ప్రజలకు మరింత మమేకమవుతూ వారికి అందుబాటులో ఉండాలని చెప్పారు. షీ టీమ్స్‌పై అవగాహన కల్పిస్తూ బాధితుల పట్ల తక్షణ స్పందనను సిబ్బంది చూపించాలని సూచించారు. ఫిర్యాదు దారుని పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వారి నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులను త్వరితగతిన చేధించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకై కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగాలని వారికి సూచించారు. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లకు గురయ్యే పోలీసులకు మానసికోల్లాసం ఎంతో అవసరమని, దీనికి గాను రానున్న రోజుల్లో మెడిటేషన్, యోగాలు క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఈ శిక్షణా తరగతుల్లో అదనపు డిసిపి రవి కుమార్, ఎసిపి చంద్రయ్య తదితరులున్నారు.