కరీంనగర్

మమత కరువైన ‘సమత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 13: లోకం పోకడ తెలియక, వంటింటికే పరిమితమైన నారీలోకాన్ని చైతన్యపరుస్తూ.. వారిని సంఘటితశక్తిగా రూపుదిద్దుతూ.. అక్షరాస్యులను చేసి, సంక్షేమ పథకాలు వారి దరికి చేరుస్తూ, స్వశక్తివంతులుగా తీర్చిదిద్దుతూ మూడు దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా పాలకుల ఆదరాభిమానాలు చూరగొన్న మహిళా సమతా సొసైటీ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. నిధుల కొరతతో నీరసిస్తూ గత కొన్నాళ్ళుగా కుంటినడకన కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో లక్ష్యం నెరవేరకుండానే అర్ధంతరంగా ఎత్తేస్తుండడంతో, స్ర్తిసాధికారత ఎండమావిగా మారనుంది. ఈ ప్రాజెక్టులో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వేలాదిమంది సిబ్బంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా 1986లోమహిళా సమతా సొసైటీకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అంకురార్పణ చేసింది. దీనిని స్వచ్ఛంద సంస్థగా ప్రకటించి, ఈ ప్రాజెక్టు చేపట్టే పనులకు ప్రత్యేక బడ్జెట్ కింద నిధులు విడుదల చేస్తూ వచ్చింది. మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువ, లింగవివక్ష అధికంగా ఉన్న ప్రాంతాల్లోని మహిళలకు ఈ సంస్థ మేమున్నామంటూ భరోసానిస్తూ, వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఈసంస్థ తన సేవలందిస్తుండగా, ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. 130 జిల్లాలు, 679 మండలాల్లోని 44,446 గ్రామాల్లో 14,41,928 మంది మహిళలతో నిత్యం అనుబంధం కలిగి కార్యక్రమాలు కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లోగల 84 మండలాల్లోని 3637 గ్రామాల్లో 1,77,750 మంది గ్రామీణ పేదరిక స్ర్తిలతో మమేకమై వారి సాధకబాధకాల్లో పాలుపంచుకుంటోంది. ముఖ్యంగా చదువు, ఆరోగ్యం, సహజవనరుల అభివృద్ధి, సామాజిక అంశాలతో పాటు మహిళా హక్కులు, చట్టాలు, మహిళా రిజర్వేషన్లు, లింగవివక్ష లేని సమాజం కోసం ప్రత్యేకంగా కృషిచేస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా నిర్దేశించిన లక్ష్యం చేరుకునే దిశగా సమతా సొసైటీ ముందడుగేస్తుండగా, అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టును రద్దుచేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో ఏళ్ళ తరబడి వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్న సిబ్బంది అభ్యర్థన మేరకు కేరళ, కర్ణాటక, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రాజెక్టును ఇతర విభాగాల్లోకి మార్చి కొనసాగించేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించి, ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేశాయి. తెలంగాణలో మాత్రం ఇప్పటికీ వీరి కొనసాగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో రాష్టవ్య్రాప్తంగా ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

వడ గాల్పుల నుండి ప్రజలు తగిన రక్షణ తీసుకోవాలి

* జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్

ముకరంపుర (కరీంనగర్), ఏప్రిల్ 14: జిల్లాలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున ప్రజలందరు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేసవిలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల మద్య అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వడదెబ్బ కేసుల చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓ ఆర్ ఎస్ ను త్రాగాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు నీటిని ఎక్కువగా తీసుకోవాలని, పండ్లరసాలు, కొబ్బరిబొండాలు, నిమ్మకాయ శరబతు, చల్లని మజ్జిగ తాగాలని ఎండలో నడిచేటప్పుడు గొడుగు ఉపయోగించాలని తెలిపారు.

వడదెబ్బతో కూలీ మృతి
వెల్గటూరు, ఏప్రిల్ 14: మండల పరిధిలోని ఎండపెల్లి గ్రామానికి చెందిన కనుకుట్ల లక్ష్మిరాజం (40) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. ధర్మారం, వెల్గటూరు మండలంలో గల ఇటుక బట్టీలలో లక్ష్మిరాజం కూలీ పని చేస్తు ఉంటాడు. కాగా గురువారం ఆదిలాబాద్ జిల్లా బిజోన్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య నీలమ్మ, కొడుకులు రాజు, రవితేజలు ఉన్నారు.

ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి
కమలాపూర్, ఏప్రిల్ 14: మండలంలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన గడల సందీప్ (24) అనే ఎంసెట్ విద్యార్థి గురువారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..సందీప్ హన్మకొండ ఎస్‌ఆర్ కళాశాలలో ఎంసెట్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్నాడని, గురువారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యవసాయ భూమిలోని గడ్డిని దులిపేందుకు వెళ్లి తరువాత స్నానం చేసేందుకు బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడగా స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసి కొన ఊపిరితో ఉన్న సందీప్‌ను చికిత్సనిమిత్తం పరకాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు, మృతుని తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.