కరీంనగర్

వచ్చే విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 28: వచ్చే విద్యా సంవత్సరం నుండి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు, ఈ విధానం ద్వారా కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కిమ్స్ డిగ్రీ, పిజి కళాశాలలో నిర్వహించిన యువతరంగ్-2015 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు విలువలతో కూడిన, నైపుణ్యాలతో కూడిన విద్యనభ్యసించేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని విశ్వ విద్యాలయాలకు తీసిపోకుండా నూతన విశ్వ విద్యాలయాలను ప్రవేశపెట్టే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదన్నారు. సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలగాలంటే విద్యార్ధి దశలోనే అది సాధ్యపడుతుందని, విద్యా ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. మరో అతిథి ఎస్‌యు రిజిష్ట్రార్ ఆచార్య కోమల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ అభివృద్ధి పథంలో సాగాలన్నారు. కేవలం మార్కులు, ప్రశంసా పత్రాలే కాకుండా నైపుణ్యాలతో కూడిన విద్య నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యా సంస్థల అధినేత రవీందర్‌రావు, కరస్పాండెంట్ దేవేందర్‌రావు, ప్రిన్సిపాల్ అర్జున్ రావు, ఎఓ లింగారెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.