కరీంనగర్

నేరస్థుల్లో మార్పు కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 18: ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల నియంత్రణ, ఛేదనకు కృషిచేస్తున్న పోలీసు శాఖ సకల నేరస్థుల్లో మార్పు తీసుకురావటం ద్వారా నేర రహిత (క్రైమ్ ఫీ)గా మార్చాలనే సంకల్పంతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘సకల నేరస్థుల సమగ్ర సర్వే’లో భాగంగా గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల సీపీలు, ఎస్పీల నుంచి కిందిస్థాయి సిబ్బంది హోంగార్డు వరకు నేరస్థుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించారు. పదేళ్ల నాటి నేరస్థులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతోపాటు వారి ఇళ్లకు జియో ట్యాంగింగ్ చేశారు. నేరస్థులకు సంబంధించిన సెల్‌ఫోన్, ఇంటి నెంబర్, ఆధార్, ఓటర్, పాన్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకాలు, వినియోగిస్తున్న వాహనాలు, జైలు నుండి విడుదలై వచ్చి ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు ? ఏం పనిచేస్తున్నారు ? పనిచేస్తున్న సంస్థలు తదితర వివరాలను పోలీసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో నిర్వహించిన సకల నేరస్థుల సమగ్ర సర్వేలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో చైన్‌స్నాచర్, సెల్‌ఫోన్ల దొంగ మద్నాల నవీన్ ఇంటిని ఐజీ నాగిరెడ్డి, సంతోష్‌నగర్‌లోని రాత్రి కన్నపు నేరాల దొంగ ఇస్లావత్ శ్రీకాంత్ ఇంటిని సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమీషనరేట్ పరిధిలో 93 బృందాలతో సర్వే నిర్వహించామని, పదేళ్ల నుండి నేరాల పాల్పడిన వారి వివరాలను మాత్రమే సేకరిస్తున్నట్లు తెలిపారు. కమీనరేట్ పరిధిలో మొత్తం వివిధ రకాల నేరాలకు పాల్పడిన వారు 5,641 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఇందులో 3,944 మంది జిల్లాలో ఉండగా, మిగిలిన వారు ఇతర జిల్లాల్లో ఉంటున్నారని వివరించారు. ఈ సర్వేలో బంధువులకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తుండటంతో ఒకవేళ నేరస్థులు తప్పించుకుపోయినా వారి ఆచూకీ సులువుగా లభించే అవకాశం ఉంటుందని అన్నారు. అటు గస్తీ బృందాల ద్వారా వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై హీస్టరీ షీట్లను తెరుస్తామని ప్రకటించారు. నేరాల నియంత్రణ కోసమే ఈ సర్వే కొనసాగించడం జరుగుతున్నదని సీపీ తెలిపారు. ఈ సర్వేలో అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.